దిశ, ఫీచర్స్ : చెదపురుగులు ఇంట్లో ఉండకూడదని జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతుంటారు కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు తరిమికొట్టాలి. మీ ఇంటి మూలల్లో పొడిగా ఉండేలా చూసుకోవాలి తడిగా ఉంటే చెదల బాగా పెరుగుతాయి. అందుకే ఇంట్లోని తేమను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. చెదపురుగులు మీ ఇంటిని నాశనం చేయకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి.
తేమ : మీ ఇంటి మూలల్లో కొంచం కూడా తేమ లేకుండా చూసుకోండి. వర్షాలకు గోడల నుంచి ఇంట్లోకి నీరు దిగుతుంటుంది. ఇలా ఉంటే సిమెంట్ తో పగుళ్ళను పూరించండి.
చెక్క : వర్షాకాలంలో చెదపురుగులు రాకుండా తలుపులను సున్నం కానీ పెయింట్ వేయాలి. ఇలా వేసిన తర్వాత చెదలు పట్టకుండా ఉంటాయి.
వేపనూనె: వేపనూనె అన్నింటికీ ఉపయోగపడుతుంది. దీని వలన మీరు సులభంగ చెదపురుగులను వదిలించుకోవచ్చు.
నిమ్మకాయ: రెండు స్పూన్ల నిమ్మ రసాన్ని బాటిల్లో తీసుకుని చెదపురుగులను ఉన్న చోట పిచికారీ చేయాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.