తమిళ చిత్ర రంగంలో ఇళయ దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ అలాంటి ఇలాంటి క్రేజ్ కాదు. కొన్ని లక్షల మంది అభిమాన సైన్యాన్ని కలిగి ఉన్న ఒక కమాండర్ విజయ్. కొన్ని వారాల క్రితం విజయ్ నుండి వచ్చిన లియో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి టాక్ తో సంబంధం లేకుండా రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. దీంతో విజయ్ ఫాన్స్ ఎంతో ఆనందంతో ఉన్నారు.
ఈ రోజు వాళ్ళ ఆనందం రెట్టింపు అవ్వబోతుంది.
సాధారణంగా విజయ్ నటించిన ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్ సినిమా విడుదలకి ముందే అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరుగుతుంది. ఆ ఫంక్షన్ లో తమ అభిమాన కధానాయకుడ్ని దగ్గరగా చూసుకుని అభిమానులు మురిసిపోయేవారు. కానీ లియో ఆడియో ఫంక్షన్ జరగకపోయే సరికి విజయ్ అభిమానులు నిరుత్సాహా పడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆనందపడేలా లియో మూవీ సక్సెస్ మీట్ ఈ రోజు సాయంత్రం నెహ్రు ఇండోర్ స్టేడియంలో జరగనుంది. ఈ సక్సెస్ మీట్ లో విజయ్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడబోతున్నాడు.
దీంతో తమిళనాడు వ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానుల్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. లియో విడుదలకి ముందే ఆడియో ఫంక్షన్ జరగకపోవటానికి రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఉన్నాయనే వార్తలు తమిళనాడు వ్యాప్తంగా చాలా బలంగా వినిపించాయి. ఏది ఏమైనా ఇప్పుడు లియో సక్సెస్ మీట్ జరుగుతుండటంతో విజయ్ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అలాగే విజయ్ ఏం మాట్లాడతాడు అనే దాని మీద కూడా విజయ్ ఫాన్స్ లోను సామాన్య ప్రజల్లోను ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.