Health Care

చెరుకు రసం ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఆ సమయంలో తాగితేనే నష్టం !


దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండవేడి నుంచి ఉపశమనానికి చల్లని పానీయాలు తాగడానికి ఇష్టపడుతుంటాం. శరీరానికి తక్షణ శక్తినిచ్చే కోకోనట్ వాటర్, చెరుకు రసం ఈ సీజన్‌లో చాలా మేలు చేస్తాయి. బయట వివిధ పనుల నిమిత్తం తిరుగున్నప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు గొంతు తడారిపోయినట్లు అనిపిస్తుంది. ఈ సందర్భంలో ఎనర్జీ లెవల్స్ కూడా వేగంగా పడిపోతాయి. అటువంటప్పుడు చెరుకు రసం తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

చెరుకు రసంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌తోపాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాహాన్ని తీర్చడమే కాకుండా, చెరుకురసం ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటంవల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఉండటంవల్ల తరచుగా చెరుకు రసం తాగేవారు అధిక బరువు కూడా తగ్గుతారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు మాత్రం భోజనం తర్వాత చెరుకు రసం తాగడం ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. ఇందుకంటే ఇందులో కార్బో హైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. భోజనం చేయగానే తాగడంవల్ల రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని డయాబెటిస్ పేషెంట్లు ఉదయం పూట ఖాళీ కడుపుతోగానీ లేదా బ్రేక్ ఫాస్ట్ చేశాక ఒక గంట తర్వాత, భోజనానికి ఒక గంట ముందు తాగితే ఎటువంటి ప్రభావం పడదు.



Source link

Related posts

కడుపుతో ఉన్నప్పుడు జుట్టుకు రంగు వేసుకోవడం సురక్షితమేనా?

Oknews

పెరుగులో నీటిని కలిపి మజ్జిగ చేస్తున్నారా.. అయితే, వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!

Oknews

చద్దన్నం వల్ల ప్రయోజనాలు తెలిస్తే వదిలి పెట్టరు!

Oknews

Leave a Comment