చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో …..చేపలు పట్టడానికి చెరువుకు వెళ్ళిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన బుధవారం మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలంపల్లి గ్రామానికి చెందిన యాట లక్ష్మణ్ (25) మంగళవారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్ళి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల,బంధువుల దగ్గర వెతికిన అతని ఆచూకీ లభించలేదు. బుధవారం స్థానికులు చేపలు పట్టడానికి వెళ్లాడని చెప్పారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు బుధవారం సాయంత్రం పోలంపల్లి గ్రామ శివారులో ఉన్న తుర్కల చెరువు వద్దకు వెళ్లి చూడగా అతని బట్టలు,చెప్పులు కనిపించాయి. దీంతో వారు గజ ఈతగాళ్ళని రప్పించి చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు కుటుంసభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Source link
previous post