EntertainmentLatest News

చౌదరి దెబ్బకి చిరంజీవి తో సహా మెగా ఫ్యామిలీ  మొత్తం ఫోన్ చేసింది


 

కామెడీ విలన్ గా సుదీర్ఘ కాలం నుంచి ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న నటుడు రఘుబాబు(raghu babu)హీరో ఎవరైనా కానీ తనదైన మార్కుతో ప్రేక్షకులు ఇంటికి వెళ్ళాకా కూడా తన గురించి మాట్లాడుకునేలా చెయ్యడం రఘుబాబు నటనకి ఉన్న స్పెషాలిటీ. తన తండ్రి గిరి బాబు నుంచి ఈ ఆనవాయితీ వారసత్వంగా వచ్చిందని భావించవచ్చు. ఇక తాజాగా రఘుబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

రాజ్ తరుణ్(raj tarun)మాల్వి మల్హోత్రా జంటగా వస్తున్న మూవీ తిరగబడరా సామి(tiragabadara saami)హిట్ చిత్రాల దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి(ravi kumar chowdary)దర్శకుడు కావడంతో అందరిలో  భారీ అంచనాలే  ఉన్నాయి. రఘుబాబు కూడా ఇందులో  ఒక కీలక పాత్ర పోషించాడు. అగస్ట్ 2 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొన్న రఘు బాబు మాట్లాడుతు చౌదరి దర్శకత్వంలో వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం లో చాలా మంచి క్యారక్టర్ చేశాను. 

ఆ క్యారక్టర్ కి ఎంత గుర్తింపు వచ్చిందంటే చిరంజీవి(chiranjeevi)దగ్గరనుంచి మొదలుకొని  మెగా ఫ్యామిలీ లో ఎంత మంది హీరోలు ఉన్నారో అందరి దగ్గర నుంచి నా యాక్టింగ్ ని  మెచ్చుకుంటు ఫోన్స్ వచ్చాయని చెప్పాడు. విషయం పాతదే అయినా కూడా ఇప్పుడు ఫ్రెష్ గా చెప్పడంతో ఆ మాట  బాగానే వైరల్ అవుతుంది. అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మాతలుగా 2014 లో పిల్ల నువ్వు లేని జీవితం రిలీజ్ అయ్యింది.సాయి ధరమ్ తేజ్ హీరో కాగా రెజీనా హీరోయిన్.



Source link

Related posts

Feedly AI understands vulnerability threats – Feedly Blog

Oknews

Quarter.. Money.. Attack on YS Jagan! రూ. 350 ఇవ్వలేదని వైఎస్ జగన్‌పై దాడి!

Oknews

నా గురించి ఆలోచించకపోవడం మీ హక్కు.. సినిమాలు మానేశా  

Oknews

Leave a Comment