తెలుగుదేశం పార్టీ ఈ నెల 21 నుంచి మొదలు కానున్న శాసన సభ సమావేశాల్లో పాల్గొనాలని నిర్ణయించింది. ఈ సమావేశాలలోనే అమీ తుమీ అధికార వైసీపీతో తేల్చుకోవాలని డిసైడ్ అయింది. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపధ్యంలో టీడీపీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
మొదటగా చూస్తే చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో సభకు వెళ్లకూడదని టీడీపీ ఆలోచిస్తోంది అని ప్రచారం జరిగింది. అయితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కె అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో అసెంబ్లీకి వెళ్లడమే మంచి వ్యూహం అని ఆలోచించారని అంటున్నారు.
సభలోకి వెళ్లి మరీ చంద్రబాబు అక్రమ అరెస్ట్ మీద పట్టుబట్టాలని కూడా టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని అసెంబ్లీ వేదికగా లేవనెత్తాలని కూడా నిర్ణయించింది. దానికి మీద చర్చ కూడా కోరాలని టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఒక వేళ చర్చకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా తమ నిరసనలు సభలోనే చేపట్టాలని కూడా నిర్ణయించారు.
సభలో బాబు అక్రమ అరెస్ట్ మీద చర్చకు ప్రభుత్వం ఓకే అన్నా లాభమే. ఒకవేళ అలా కాకుండా చర్చకు అవకాశం ఇవ్వకపోయినా నిరసనలు తెలిపే అవకాశం దక్కుతుందని, ఇవన్నీ కూడా ప్రజలలో కూడా విస్తృత చర్చకు వెళ్తాయని కూడా భావిస్తున్నారు.
ఏదైనా రాజకీయంగా తమకు లాభమే కాబట్టి అసెంబ్లీకి వెళ్లడ‌మే బెటర్ అని టీడీపీ యోచిస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో టీడీపీ కనుక సభకు వస్తే మొదటి రోజు నుంచే సభలో రచ్చగానే ఉంటుంది అని అంటున్నారు. అధికార పక్షం అయితే బాబు అరెస్ట్ సబబు అంటోంది.
ఆయన అవినీతి రుజువు అయింది కాబట్టే చట్టం అరెస్ట్ చేసింది దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అని కూడా వాదిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు ఏకైక అజెండా ను పెట్టుకుని బాబు అరెస్ట్ నే ప్రస్తావించాలని చూస్తే ప్రభుత్వం ఎటూ వారికి ఆ చాన్స్ ఇవ్వదు.
అందరినీ సభ నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే సభ నుంచి బహిష్కరించినా బయట మీడియా ఎదుట టీడీపీ కామెంట్స్ చేస్తుంది. అసెంబ్లీ బయట ఆందోళనలు చేసేందుకు కూడా వీలు ఉంటుంది. మొత్తం మీద చూస్తే టీడీపీ బాబు అరెస్ట్ మీద అసెంబ్లీని స్థంభింపచేయాలని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. దాన్ని వైసీపీ కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. మొత్తానికి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఈసారి అసెంబ్లీ సెషన్ బిగ్ సౌండ్ చేయనుంది.