GossipsLatest News

జగన్‌ను చీల్చి చండాడిన షర్మిల..


ఏమన్నా బాణాలా అవి? ఏమన్నా దూసుకెళ్లుంటాయా? ఏమో అనుకున్నాం కానీ.. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల మాటలకు అన్న అయిన సీఎం జగన్‌కు నోట మాట రాదంటే నమ్మండి. షర్మిల ఆ స్థాయిలో జగనన్నపై మాటల తూటాలను పేల్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షర్మిల నా చెల్లి కాదు.. నా కూతురంటూ జగన్ ఎక్కడ లేని ప్రేమను ఒలకబోశారు. మరి కూతుర్ని ఏ తండ్రైనా రోడ్డుకీడుస్తారా? తన కూతుళ్లకేమో అత్యంత ఖరీదైన ప్రాక్స్‌మేట్ సెక్యూరిటీ.. చెల్లి మాత్రం రోడ్డున పడినా పట్టించుకోరు. ఇవాళ తనకు ఎదురొచ్చేసరికి కూతురు.. గాడిద గుడ్డంటూ కబుర్లా? కనీసం చెల్లి తన కుమారుడి వివాహానికి పిలవడానికి వచ్చినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేనంత బిజీ కదా.. సెక్యూరిటీ చేతికి ఇన్విటేషన్ ఇచ్చి పోతానంటూ కానీ ఓకే అనలేదు. ఆ రోజు ఇంటికి వస్తానంటోంది కూతురు లాంటి చెల్లెలని గుర్తుకు రాలేదే? అందుకేనేమో.. ఆమె ఈటెల్లాంటి మాటలను బాణాల మాదిరిగా వదిలారు.

దానికి సాక్ష్యాలు.. దేవుడు, నా తల్లే..

ఏపీసీసీ చీఫ్‌‌గా బాధ్యతలు చేపట్టాక షర్మిల తన అన్న.. ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తారా? లేదా? అని ఆసక్తిగా ఎదురు చూసింది ఏపీ ప్రజానీకం. షర్మిల మాత్రం తన ఎదురుగా ఉన్నది అన్నని కాకుండా ప్రత్యర్థి గానే చూస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదో చీల్చేసిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగనన్న. దేవుడే గుణపాఠం చెబుతారట’ అన్న జగన్ మాటలను ఊటంకిస్తూ  షర్మిల అన్నను ఏకిపారేశారు. ఆంధ్ర అభివృద్ధికి నోచుకోకుండా ఇంత దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం జగనన్నేనన్నారు. వైఎస్సార్ కుటుంబం చీలడానికి సాక్ష్యాత్తూ జగనే కారణమన్నారు. దీనికి సాక్ష్యాలు దేవుడు, తన తల్లి విజయమ్మ, యావత్ కుటుంబమన్నారు. జగన్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో 18 మంది రాజీనామాలు చేసి అన్న వైపు నిలబడితే అధికారంలోకి వచ్చాక వారందరినీ మంత్రులను చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. 

ఎండెనక, వానెనక రోడ్డు మీదనే ఉన్నా..

ఇప్పుడు వారిలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారని ప్రశ్నించారు. వైసీపీ కష్టాల్లో ఉందని తనను పాదయాత్ర చేయమన్న విషయాన్ని సైతం షర్మిల గుర్తు చేసుకున్నారు. తన ఇంటిని, పిల్లలను కూడా పక్కనబెట్టేసి ఎండెనక, వానెనక రోడ్డు మీదనే ఉన్నానని తెలిపారు. తరువాత సమైఖ్య యాత్ర చేయమంటే కూడా జనం కోసమే కదాని చేశానన్నారు. చివరకు తెలంగాణలో సైతం ఓదార్పు యాత్ర చేశానని షర్మిల వెల్లడించారు. స్వలాభం చూసుకోకుండా.. నిస్వార్థంగా.. ఎందుకని కూడా అడగకుండా ఎప్పుడడిగితే అప్పుడు ఏం చేయమంటే అది చేశానన్నారు. దేశంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్యాంపెయిన్ చేసి.. జగన్‌ని ముఖ్యమంత్రిని చేశానన్నారు. మంచి ముఖ్యమంత్రిగా ఉంటూ వైఎస్ఆర్ పేరు, ఆశయాలను నిలబెడితే చాలనుకుంటే ఐదేళ్లలో బీజేపీకి బానిసయ్యారని షర్మిల విమర్శించారు. ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకున్నా రాష్ట్రంలో బీజేపీ రాజ్యమేలుతోందన్నారు. వైసీపీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా అన్న అంశాన్నే లేకుండా చేశారని షర్మిల విమర్శించారు.



Source link

Related posts

ఇళయరాజా బయోపిక్‌… ధనుష్‌కి ఎంతవరకు సూట్‌ అవుతుంది?

Oknews

Case against Pawan Kalyan పవన్ కల్యాణ్‌పై కేసా.. ఏం సాధించాలని?

Oknews

ఊరు పేరు భైరవకోన.. పార్ట్-2 కూడా ఉంది!

Oknews

Leave a Comment