తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.(rajamouli)2001 లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ తో ఆయన సినీ ప్రయాణం మొదలయ్యింది. సింహాద్రి, యమదొంగ, ఛత్రపతి, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుడుగా మారాడు. అలాంటి రాజమౌళి కి మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో జగన్ ని ఘోరంగా ఓడించాడా!
తాజాగా ఒక టీవీ ఛానల్ కి సంబంధించిన యాంకర్ తన విశ్లేషణలో మాట్లాడుతు జగన్ ఓటమికి గల కారణాలని చెప్పుకొచ్చాడు. అందులో ఒక కారణంగా రాజమౌళి నిలిచాడు. విషయం ఏంటంటే జగన్(jagan)ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మాటల ప్రస్థానంలో రాజమౌళి ఎవరో నాకు తెలియదు, డైరెక్టర్ అంటున్నారు, ఏ సినిమాలు తీసాడని అన్నాడంట. ఈ విషయాన్నే సదరు యాంకర్ చెప్పాడు. దీంతో ఇప్పుడు ఆ మాటలు వైరల్ గా నిలిచాయి. పైగా అందరు ఒక్కసారి అందరు గతంలో కి వెళ్లారు.
సిఎం స్థానంలో ఉన్న జగన్ దగ్గరకి సినీ సమస్యల పరిష్కారానికి సంబంధించి చిరంజీవి(chiranjeevi)నేతృత్యంలో మహేష్ బాబు (mahesh babu)నాగార్జున,ప్రభాస్, రాజమౌళిలు కలిశారు. ఆ సందర్భంలోనే రాజమౌళి ఎవరో తనకు తెలియదని జగన్ అన్నాడు. చిరంజీవి అంతటి వ్యక్తి కూడా నమస్కారం చేస్తే తిరిగి నమస్కారం పెట్టకుండా చిరునవ్వుతో చూస్తు ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో జగన్ కి పోయే కాలం కాకపోతే రాజమౌళి తెలియకపోవడం ఏంటో, చిరు ని చూసి నవ్వడం ఏంటో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.