ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా విజ‌య‌వాడ ప్రాంతంలో బ‌స్సు యాత్ర‌లో ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్ పై రాతి దాడి జ‌రిగింది. జ‌న‌స‌మూహం నుంచి ఒక అగంత‌కుడు ముఖ్య‌మంత్రిని ల‌క్ష్యంగా రాతిని విసిరాడు. రాయి బ‌లంగా ఎడ‌మ కంటికి పైన తాక‌డంతో జ‌గ‌న్ కు బ‌ల‌మైన గాయ‌మే అయ్యింద‌ని, ఫొటోలు వీడియాల‌ను బ‌ట్టి అర్థం అవుతూ ఉంది.
రాతి దాడి త‌ర్వాత సీఎం జ‌గ‌న్ ప్రాథ‌మిక చికిత్స తీసుకుని యాత్ర‌ను కంటిన్యూ చేశారు. అగంత‌కుడు లేదా అగంత‌కులు వ‌ర‌స పెట్టి రాళ్ల‌తో దాడికి దిగార‌ని అర్థం అవుతోంది. జ‌గ‌న్ తో పాటు ప‌క్క‌నే ఉన్న ఎమ్మెల్యే కు కూడా రాళ్లు త‌గిలిన‌ట్టుగా స‌మాచారం అందుతూ ఉంది.
ఎన్నిక‌ల ప్ర‌చార వేళ ఈ ఉదంతం వేడి రేపుతోంది. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్య‌ర్థుల ప‌నే అంటోంది. తెలుగుదేశం పార్టీ ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు విమ‌ర్శిస్తున్నారు.
ఏదేమైనా.. ప్ర‌చారంలో ఇలాంటి చ‌ర్య‌లు ఏర‌కంగానూ స‌మ‌ర్థ‌నీయం కాదు. ఈ దాడిలో జ‌గన్ కు పెద్ద ముప్పు త‌ప్పింద‌నే స్ప‌ష్టం అవుతోంది. కాస్త దిగువ‌న త‌గిలి ఉంటే.. కంటికి తీవ్ర ప్ర‌మాదం ఏర్ప‌డేది.