వయసు మీద పడుతున్న కొద్దీ కోపాలు, పగలు, ప్రతీకారాలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ మాజీ సిఎమ్ నారా చంద్రబాబు నాయుడు మాత్రం పగతో, కోపతాపాలతో రగిలిపోతున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ విడియో చంద్రబాబు మాటల తీరు అలా వుంది మరి. జగన్ కు మిజరబుల్ ట్రీట్ మెంట్ వుంటుంది అని చంద్రబాబు అంటున్నారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి ట్రీట్ మెంట్ ఇతనికి వుంటుంది అన్నారు చంద్రబాబు ఆ విడియోలో. అంటే దీన్ని బట్టి చంద్రబాబు ఎంత కసి, కోపంతో రగిలిపోతున్నారో అర్థం అయిపోతోంది.
చరిత్రలో అతిగా ప్రవర్తించేవారికి ఇలాంటి ఎండింగ్ నే వుంటుంది అని, దానికి అతను కూడా సిద్దం కావాలని, అతనే కాదు, అతని పార్టీ వాళ్లు కూడా ఇలాంటి ట్రీట్ మెంట్ కు రెడీ కావాలని చంద్రబాబు అన్నారు. ఇక్కడ అతను..అతను..అతని పార్టీ అంటే జగన్, వైకాపా తప్ప మరోటి కాదు అని అర్థం అవుతూనే వుంది.
చంద్రబాబు ఇప్పటి వరకు జగన్ మీద కోపం పడడం చూసాం..విమర్శలు చేయడం చూసాం…కానీ అధికారంలోకి వస్తే జగన్ కు మిజరబుల్ ట్రీట్ మెంట్ వుంటుంది, పార్టీ జనాలకు కూడా ఇలాంటి ట్రీట్ మెంట్ వుంటుంది అని చెప్పడం ఇదే తొలిసారి కావచ్చు. జగన్ అధికారంలో వుంటే తెలుగుదేశం జనాలను ఇబ్బంది పెట్టారనే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారు. మరి ఆయన కూడా తాను అధికారంలోకి వస్తే అదే చేస్తా అంటున్నారు. ఇద్దరూ ఒకటే రకం అన్న మాట.