విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తనకి ఏదనిపిస్తే అది చెప్తారు, ఏదనిపిస్తే అది చేస్తారు. అందుకే ఆయన మాటలు, చర్యలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఆయన సీనియర్ నటి జయసుధ చేతిలో నుంచి ఫోన్ లాగిన ఘటన హాట్ టాపిక్ గా మారింది.
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా జరిగిన ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మోహన్ బాబు, జయసుధ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, జయసుధ పక్కపక్కన కూర్చున్నారు. ఆ సమయంలో జయసుధ ఫోన్ పట్టుకొని చూస్తుండగా.. మోహన్ బాబు వెంటనే ఆ ఫోన్ లాగి, పక్కన పెట్టు అన్నట్టుగా కాస్త సీరియస్ లుక్ ఇచ్చారు. మొదట ఆ చర్యతో ఉలిక్కిపడిన జయసుధ, ఆ తర్వాత స్మైల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోని బట్టి చూస్తే.. జయసుధతో తనకున్న చనువు కొద్దీ ‘ఈ సమయంలో ఫోన్ అవసరమా’ అని ఫోన్ లాక్కొని పక్కన పెట్టమని మోహన్ బాబు చెప్పినట్టుగా అనిపిస్తోంది.