EntertainmentLatest News

జరిగిందేదో జరిగిపోయింది. నెక్స్‌ట్‌ ఏంటి.. ఆలోచనలో పడ్డ వెంకటేష్‌!


విక్టరీ వెంకటేష్‌ తను చేసే సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారు, తన క్యారెక్టర్‌ ఎలా ఉంటే ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తారు అనే విషయంలో అతనికి ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టే విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తుంటాడు. అందుకే ఓవరాల్‌గా అతనికి సక్సెస్‌ రేట్‌ ఎక్కువ. అయితే ఒక్కోసారి అతని అంచనా కూడా బెడిసి కొడుతుంది. తాజాగా ‘సైంధవ్‌’ విషయంలో అదే జరిగింది. ఈమధ్యకాలంలో వెంకీ ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చెయ్యలేదు. మరోసారి ఆ జోనర్‌ని టచ్‌ చేద్దామనుకున్నాడు. దానికి కూతురు సెంటిమెంట్‌ కూడా తోడవడంతో రిస్క్‌ చెయ్యొచ్చు అనుకున్నాడు. కానీ, ‘సైంధవ్‌’ రిలీజ్‌ అయిన మొదటి రోజు మొదటి షో నుంచి సినిమాపై నెగెటివ్‌ టాక్‌ మొదలైంది. యునానిమస్‌గా సినిమా ఫ్లాప్‌ అని డిసైడ్‌ అయిపోయింది. దీంతో ఒక్కసారి వెంకీ షాక్‌ అయ్యాడు. సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వాటిలో ‘సైంధవ్‌’ ఒక్కటే డైరెక్ట్‌గా ఫ్లాప్‌ అనే టాక్‌ తెచ్చుకుంది.

జరిగిందేదో జరిగిపోయింది. ఇక నెక్స్‌ట్‌ సినిమా ఏమటి? ఎలాంటి సినిమా చెయ్యాలి అనే ఆలోచనలో పడ్డాడు వెంకీ. శైలేష్‌ కొలను, తరుణ్‌ భాస్కర్‌.. ఈ ఇద్దరిలో ఒకరికి సినిమా చెయ్యాల్సి ఉండగా తరుణ్‌ భాస్కర్‌ని పక్కనపెట్టి శైలేష్‌కి ఓకే చెప్పాడు. తరుణ్‌తో సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ, అది మెటీరియలైజ్‌ కాలేదు. దానికి కారణం కథపై తనకు పూర్తి క్లారిటీ లేదని, ముఖ్యంగా సెకండాఫ్‌ విషయంలో తను ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్టు తరుణ్‌ చెబుతున్నాడు. అయితే అది నిజం కాదని, తరుణ్‌ భాస్కర్‌పై వెంకటేశ్‌కి నమ్మకం కుదరలేదని, అందుకే సినిమా ఇంతవరకు సెట్స్‌పైకి వెళ్లలేదని చెప్పుకుంటున్నారు. మంచి ట్రాక్‌ వున్న తరుణ్‌ని నమ్మకుండా శైలేష్‌కి అవకాశం ఇవ్వడం వల్ల వచ్చిన ఫలితాన్ని చూసిన తర్వాత వెంకటేశ్‌ ఆలోచనలో కూడా మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తరుణ్‌తో సినిమా చేసేందుకు ఆల్‌మోస్ట్‌ ఓకే చెప్పాడని సమాచారం. ఈ సినిమాతోపాటు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో కూడా ఓ సినిమా ప్లానింగ్‌లో ఉంది. ఈ సినిమాలో వెంకటేశ్‌తోపాటు నాని కూడా నటిస్తాడని అంటున్నారు. ఈ మల్టీస్టారర్‌తో వెంకీ మరో సూపర్‌హిట్‌ కొట్టడం ఖాయమని అభిమానులు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందు మొదదలవుతుందనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. 

వెంకటేష్‌కి ప్రస్తుతం ఉన్న ఇమేజ్‌ దృష్ట్యా యాక్షన్‌ సినిమాల జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదని అందరి అభిప్రాయం. అతనికి హీరోగా మంచి పేరు తెచ్చిన సినిమాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే. కాబట్టి ఆ తరహా సినిమాలతోనే ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్‌ కథ, మాటలు అందించాడు. ఆ రెండు సినిమాలు వెంకటేష్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్స్‌గా నిలిచిపోయాయి. ఇక కరుణాకరన్‌ దర్శకత్వంలో వచ్చిన వాసు చిత్రానికి మాటలు అందించాడు. అయితే త్రివిక్రమ్‌ డైరెక్టర్‌ అయిన తర్వాత అతని కాంబినేషన్‌లో వెంకటేష్‌ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు వినిపిస్తున్న టాక్‌ ప్రకారం త్వరలోనే వీరి కాంబినేషన్‌లో సినిమా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే వెంకటేష్‌ హిట్‌ లిస్ట్‌లోకి మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వచ్చి చేరే అవకాశం ఉంటుంది. 



Source link

Related posts

Father of Mulugu DSP | Father of Mulugu DSP | జాతీయ పక్షిని వేటాడిన పోలీస్ తండ్రి.. ఎక్కడంటే..!

Oknews

ఐదు నెలల్లో నాలుగు సినిమాలు.. మెగా ఫ్యాన్స్ కి అసలుసిసలైన పండగ..!

Oknews

‘ఐరనే వంచాలా ఏంటి?’ ట్రెండ్‌ అవుతున్న ‘ఫ్యామిలీస్టార్‌’ డైలాగ్‌

Oknews

Leave a Comment