EntertainmentLatest News

జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి కి తీవ్ర గాయాలు 


ఏ హీరో అయినా ఇంట  గెలిచి రచ్చ గెలుస్తాడు. అంటే స్వ భాషా చిత్రాల ద్వారా పేరు సంపాదించి ఆ తర్వాత పరభాషా చిత్రాలతో  పేరు సంపాదిస్తాడు. కానీ నవీన్ పోలిశెట్టి (naveen polishetty)ఇందుకు భిన్నం. రచ్చ గెలిచి ఇంట గెలిచాడు. జాతిరత్నాలు (jathiratnalu) మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి  లో అద్భుతమైన పెర్ఫార్మ్ ని ప్రదర్శించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు. తాజాగా  సోషల్ మీడియా ద్వారా ఒక విషయాన్నీ తెలియచేసాడు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.

నవీన్ గాయాల పాలయ్యాడు. కుడి చేతికి, కాలుకి తీవ్ర గాయాలు అయ్యాయి. సోషల్ మీడియాలో  వాటి ఫోటోలని కూడా షేర్ చేసాడు. ఈ సందర్భంగా కొన్ని విషయాలని కూడా అభిమానులతో పంచుకున్నాడు.  దురదృష్టవశాత్తు  నేను గాయాలు పాలయ్యాను. ఇది  నాకు చాలా క్లిష్టమైన సమయం. కోలుకునేందుకు  చాలా టైం పడుతుంది. దీంతో నా అప్ కమింగ్ మూవీని  అనుకున్న సమయానికి మీ ముందుకు  తీసుకురాలేకపోతున్నాను. అందుకు క్షమించండని చెప్పాడు. అదే విధంగా తన అభిమానులకి ఒక హామీ కూడా ఇచ్చాడు. 

నా తదుపరి సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. అది మీ అందరకి సూపర్బ్ గా నచ్చుతుంది. మీ అందరి ఆశీస్సులతో  త్వరలోనే షూటింగ్ లో అడుగుపెడతాను.  మీ ప్రేమాభిమానాలు ఎప్పుడు నాలో స్ఫూర్తిని నింపుతాయి.అతి త్వరలోనే స్క్రీన్ మీద ప్రత్యక్ష మయ్యి మిమ్మల్ని ఎంటర్ టైన్ మెంట్ చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం నవీన్ చేతిలో అనగనగా ఒక రాజు అనే మూవీ ఉంది.

 



Source link

Related posts

ఈ వారం ఓటీటీలో సినిమా పండుగ!

Oknews

Has Pawan Kalyan decided? పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారా..

Oknews

వెంకీ ఇంట పెళ్లి వేడుకల్లో నమ్రత, సితార

Oknews

Leave a Comment