అక్టోబర్ 13 జాతీయ సినిమా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇండియన్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ సినిమా ప్రేమికుల కోసం ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. గత ఏడాది కూడా ఇదేరోజున భారీ ఆఫర్ ఇచ్చిన అసోసియేషన్.. ఈ సంవత్సరం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. రేపు అంటే శుక్రవారం ఒక్కరోజు టిక్కెట్ ధరను రూ. 99గా నిర్ణయించారు.
దేశంలోని పీవీఆర్, సినీ పోలిస్, ఐనాక్స్, సిటీప్రైడ్, మిరాజ్, మూవీ టైమ్, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్‌లు ఈ ఆఫర్‌ను మూవీ లవర్స్ కు అందించనున్నాయి. గత ఏడాది ఈ సినిమా పండుగలో తెలుగు రాష్ట్రాలు పాల్గొనలేదు. మరి ఈసారైనా ఈ సినిమా ఆఫర్ తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుందా? లేదా? అన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఇతర ప్రాంతాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తెలిపాయి. దేశంలోని 4 వేలకు పైగా మల్టీప్లెక్స్‌లు ఈ పండగలో పాల్గొంటున్నాయి.