దిశ, ఫీచర్స్: జామకాయను పేదవాడి పండుగా పిలుస్తారు. ఎందుకంటే సామాన్యుడు సైతం కొనుక్కొని తినే విధంగా ఉంటుంది దీని ధర కాబట్టి. అలాగే చాలా మంది జామకాయ అంటే ఎక్కువ ఇష్టం చూపిస్తారు. కేవలం జామ కాయలే కాకుండా జామ ఆకులను కూడా తినడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఏడాదంతా అందుబాటులో ఉండే ఈ జామ ఆకులతో ఏం బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
*జామపండు మాదిరిగానే దాని ఆకులు నమలడం వల్ల కూడా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఖాళీ పొట్టతో జామ ఆకులు తినడం వల్ల జరిగే మేలు ఎక్కువ. జామ ఆకుల్లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, డైటరీ మినరల్స్, పొటాషియం, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జామ ఆకులు నమలడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు:
*అదేవిధంగా జామ ఆకులను రోజూ తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే ఫినోలిక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్లకి చాలా యూస్ ఫుల్‌గా ఉంటుంది. ఇది కాకుండా జామ ఆకు రసంలో ఉండే యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు రక్తంలో షుగర్ లెవెల్‌ను నియంత్రిస్తాయి.
మెరుగైన జీర్ణక్రియ:
*ఉదయాన్నే పరగడుపున జామ ఆకులు నమలడం వల్ల వాటిలో ఉండే డైటరీ ఫైబర్‌తో అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి కడుపు సమస్యలు రాకుండా అడ్డుపడి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
బరువు తగ్గడం:
*ఉదయాన్నే పరగడుపున జామ ఆకులు నమలడం వల్ల బెల్లీ ఫ్యాట్ తో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తాయి. ఇది బరువు పెరగడానికి దారితీయదు.
*జామకాయలో లభించే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, వ్యాధులను కలిగించే వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. జామ ఆకులు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
బీపీ అదుపులో:
*జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. జామపండు మాదిరిగానే, దీని ఆకుల్లో కూడా పొటాషియం, ఫైబర్ కలిగి ఉంటాయి, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
* అయితే జామ ఆకులను మాములు టైమ్‌లో కాకుండా పరగడుపున ఖాళీ పొట్టతో నమిలితే ఎక్కువ ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. ఇక రెండు ఆకులను రెండు నిమిషాల పాటు నీటిలో నానబెట్టిన తర్వాత బయటకు తీసి కడిగి.. వాటిని నమిలి ఆ రసాన్ని మింగేస్తే ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.