Health Care

జియోలో వాయిస్​ బ్రేక్​ సమస్యకు కారణమిదే..


జియోలో నెట్​ స్పీడ్​ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఒక్కోసారి వాయిస్​ కాల్స్​ క్వాలిటీ సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా కాల్స్​ కలవకపోవడంతోపాటు వాయిస్​ బ్రేక్​ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ సమస్య ఎందుకు వస్తుందో గుర్తిస్తే.. ఇకపై దానిబారినుంచి బయటపడొచ్చు.

వాయిస్​ బ్రేక్​..

ఇంట్లో, ఆఫీసులో వైఫై ఉండటం కామన్​గా మారింది. 5జీ ఫోన్లలో వైఫై కాలింగ్​ ఫీచర్​ ఆటోమేటిక్​గా ఎనేబుల్డ్​ అవుతుంది. దీనివల్ల వాయిస్​ కాల్స్​ నాణ్యత మెరుగుపడిన విషయం వాస్తవమే. అయితే, ఈ ఫీచరే ఇప్పుడు జియో వినియోగదారులకు చుక్కలు చూపెడుతున్నాది. వైఫ్​ కాలింగ్​ ఆప్షన్​ ఎనేబుల్డ్​ ఫోన్​ ఉన్న వినియోగదారులకు కాల్​ డ్రాప్​ సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి.

నెట్​ సిగ్నల్స్​ కాస్త తగ్గినా..

ఇంట్లో ఉన్నంత వరకూ కాల్స్​ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇంటినుంచి బయటకు వైఫై సిగ్నల్స్​కి కాస్త దూరంగా వెళ్తే.. అప్పుడు మొదలవుతుంది అసలు చిక్కులు. వైఫై సిగ్నల్స్​ లేకపోతే కాల్స్​ వాయిస్​ బ్రేక్​ అవుతూ చిరాకు పెడుతుంది. ఇక ఆఫీసులో అయితే, ఎక్కువమంది వైఫై వాడుతారు కాబట్టి.. లోడ్​ ఎక్కువగా ఉన్నా వాయిస్​ బ్రేక్​ అవుతుంది. ఈ సమస్య నివారణకు వైఫై కాలింగ్​ ఆప్షన్​ను డిసేబుల్​ చేయాల్సిందే. లేదా ఆఫీసులాంటి చోట్ల వైఫైని ఆఫ్​ చేయడం చేయాలి. కానీ, వైఫై కాలింగ్​ ఆప్షన్​ అవసరం మేరకే ఉపయోగిస్తే ఈ సమస్య రాదని టెక్​ నిపుణులు చెప్తున్నారు.

వైఫై కాలింగ్​ ఇలా డిసేబుల్​ చేయండి

ఫోన్​ సెట్టింగ్స్​లోకి వెళ్లగానే మొబైల్​ నెట్​ వర్క్​ ఆప్షన్​ ఎంచుకోవాలి. అందులో సిమ్​1, సిమ్​2 అని ఆప్షన్లు వస్తాయి. జియో సిమ్ పై క్లిక్​ చేయగానే అందులో వైఫై కాలింగ్​ అనే ఆప్షన్​ కినిపిస్తుంది. దానిని ఆఫ్​లో పెడితే సరిపోతుంది.



Source link

Related posts

విమానంలో రీల్ చేసిన వరుడు.. వీడియో వైరల్..

Oknews

వృద్ధులు, వయస్సులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమౌతుందంటే..?

Oknews

శని దోషంతో బాధపడేవారు.. ఈ పరిహారాలు చేసి చూడండి

Oknews

Leave a Comment