Andhra Pradesh

జీవీఎంసీపై కూటమి వ్యూహం- టీడీపీ, జనసేనలోకి 21 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు?-visakhapatnam news in telugu gvmc ysrcp corporators may join tdp janasena ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రెండు మూడు రోజుల్లో వైసీపీకి చెందిన దాదాపు 21 మంది కార్పొరేటర్లు టీడీపీ, జ‌న‌సేన‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించి అన్ని చ‌ర్చలు ముగిశాయి. రాష్ట్రంలోని అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ కూట‌మి స్థానిక సంస్థల‌పై క‌న్ను వేసింది. అందులో ప్రధానంగా మ‌హా విశాఖ న‌గ‌ర పాల‌క సంస్థ (జీవీఎంసీ) పీఠంపై క‌న్ను వేసింది. దాన్ని ఎలాగైనా వైసీపీ నుంచి లాక్కొవాల‌నే ప్రయ‌త్నాలు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ కూట‌మి నేత‌లు ఆ ర‌కంగా చ‌ర్యలు చేప‌ట్టారు. గురువారం రాత్రి టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌ ఎమ్మెల్యేలు, ఎంపీ, నేత‌లు ఒక హోట‌ల్ స‌మావేశం అయి ఇదే అంశాన్ని చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు, టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీ‌నివాస‌రావు, వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు, జ‌న‌సేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీ‌నివాస్‌, పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు, బీజేపీ ఎమ్మెల్యే పి. విష్టుకుమార్ రాజు, విశాఖ‌ప‌ట్నం ఎంపీ భ‌ర‌త్‌, టీడీపీ లోక్‌స‌భ అధ్యక్షుడు గండిబాబ్జీ ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో జీవీఎంసీలో బ‌లం పెంచుకోవాల‌ని, త‌ద్వారా స్టాండింగ్ క‌మిటీతో పాటు వైసీపీ నుంచి మేయ‌ర్ పీఠాన్ని సొంతం చేసుకోవాల‌ని నిర్ణయించిన‌ట్లు తెలుస్తోంది.



Source link

Related posts

TTD : శ్రీవారి ప్రత్యేక దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు

Oknews

బాలికపై లైంగిక వేధింపులు…! వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Oknews

ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్ధినిపై ట్యూషన్ టీచర్‌ దాడి.. స్థానికుల దేహశుద్ధి-locals crushed the tuition teacher who was harassing the student in the name of love ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment