జున్ను తింటున్నారా? ఇది చదవండి అయితే! | Health Benefits Of Junnu|health tips of Junnu|Junnu or kharvas health tips|Junnu|Kharvas Recipe Health Tips|Healthy Junnu| Kharvas Recipe Healthy Tips


posted on Feb 26, 2024 2:00PM

జున్ను తినలేదు ఇప్పటి వరకు అని ఎవరైనా చెప్పారు అంటే అది నిజంగా చాలా పెద్ద వింత అనుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో విరివిగా దొరికే జున్ను చాలా మంచి పౌష్టికాహారం అని అంటారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే… నాణేనికి రెండవవైపు వాదించేవారు ఉన్నారు. వారు చెప్పేది ఏంటంటే.. జున్ను ఆరోగ్యానికి హానికరం అని. ఇంకా జున్ను గురించి చాలా విషయాలు అనుమానాలుగానే ఉండిపోతున్నాయి అందరికీ. వాటిని నివృత్తి చేసే సమాచారం ఇదిగో ఇదే…

జున్నుని అని సంస్కృతంలో పీయూషం అని అంటారు. అలాగే పన్నీర్ అని హిందీలో అంటారు. ఇంకా ఇంగ్లీష్ లో అయితే చీజ్ అని అంటారు. ప్రస్తుతం చీజ్ ఆధారిత వంటలు రోడ్ సైడ్ నుండి రెస్టారెంట్ల వరకు ఒకటే హల్చల్ చేస్తుంటాయి. అయితే అదంతా కృత్రిమమైనది. 


నిజమైన జున్ను అంటే..


ఆవులు లేదా గేదెలు ఈనిన మూడు నుంచి వారం రోజుల వరకూ వచ్చే పాలు ఇస్తాయి. ఈ పాలను ‘ముర్రుపాలు’ అంటారు. వీటిలో పచ్చదనం ఎక్కువ వుంటుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలుంటాయి. ఇలా ఆవులు, గేదెలు ఈనిన మూడు నుండి వారం రోజుల లోపు ఇచ్చే పాలను పల్లె ప్రాంతాలలో ఆ దూడలు తాగగా మిగిలిపోయేవాటిని పిండి తమకు తెలిసిన ఇళ్లకు పంచుతుంటారు. ఈ పాలలో పంచదార లేదా బెల్లం, మిరియాల పొడి, యాలకులు పొడి వేసి స్టవ్ మీద కాచినప్పుడు ఆ పాలు గట్టిగా అవుతాయి. గడ్డ పెరుగులా… ఎంతో రుచిగా ఉంటుంది ఈ జున్ను. 


జున్నులో ఏముంది?


జున్నులో 355 కేలరీలు ఉంటాయి. అదే పాల నుండి మనకు లభించే వెన్నలో 716 కేలరీలు ఉంటాయి. పాల నుండి లభించే మీగడలో 204 కేలరీలు ఉంటాయి. ఇలా మూడింటిని పోల్చి చూసుకుంటే, పాల మీగడకు, వెన్నకు మధ్యగా జున్నులో కేలరీలు ఉంటాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే… ఎక్కువ కేలరీలు అవసరమయ్యే వారు మాత్రమే జున్నును ఆహారంలో భాగంగా తీసుకోవద్సమ్ మంచిది. మరీ ముఖ్యంగా షుగర్, కీళ్ల వాతం జబ్బులు, అధికబరువు గలవారు, వాతం సమస్యలు ఉన్నవారు జున్నును దూరంగా ఉంటే మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు జున్ను తీసుకుంటే అనారోగ్య సమస్యలు సులువుగా అధికమయ్యే అవకాశం ఉంటుంది.


ప్రొటీన్ల కథ :

జున్నులో ప్రొటీన్ల శాతం ఎక్కువ ఉంటుంది. ఇది నాణ్యమైన ప్రొటీన్, శరీరానికి త్వరగా చక్కగా వంటబట్టే ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. పైన చెప్పుకున్నట్టు వెన్న, మీగడతో పోల్చి చూస్తే వెన్నలో, మీగడలో ప్రోటీన్లు చాలా తక్కువ ఉంటాయి. అదే జున్నులో అయితే వీటన్నికంటే ఎక్కువగా ఉంటుంది.  జున్నులో ఉండే ప్రోటీన్ల కంటెంట్ జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వంటి ఖరీదైన పప్పులకన్నా ఎక్కువగా ఉంటుంది. 


దీన్ని బట్టి చూస్తే ప్రోటీన్ లోపంతో బాధపడేవారికి  చిక్కి శల్యమై పోతున్నవారికీ, టీబి, ఎయిడ్స్ వంటి శరీర సామర్థ్యాన్ని క్షీణింపచేసే వ్యాధులతో బాధపడే వారికి జున్ను చాలా మేలు చేస్తుంది. 


కొవ్వు:

కొవ్వు శాతం పోలిస్తే.. వెన్నలో 81 శాతం కొవ్వు వుంటే, జున్నులో 26.9%, మీగడలో 20% కొవ్వు వున్నాయని తెలిసింది.  కాబట్టి వెన్న కన్నా జున్నులోనే  తక్కువ కొవ్వు ఉంది. 


పై విషయాలు అన్నీ గమనిస్తే.. జున్నును తినకూడని పదార్థంగా భావించాల్సినంత ప్రమాదం ఇందులో ఏమీ లేదు. అయితే అతి అనేది అన్నింటిలోనూ ప్రమాదమే కాబట్టి జున్నును కూడా మితంగా తీసుకోవడం మంచిది. 


జున్ను వల్ల లాభాలు:-


జున్ను తినడం వల్ల లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అన్నివిధాలా పోషకాలు, కొవ్వులు, ప్రోటీన్లు తగినమొత్తంలో ఉండటం వల్ల శారీరకంగా బలహీనంగా ఉన్నవారికి జున్ను మేలు చేస్తుంది.శారీరకంగా చాలామంది అధిక వేడితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి శరీరవేడిని తగ్గిస్తుంది. పైత్యం చేసి ఇబ్బంది కలిగే వారు జున్ను తీసుకుంటే పైత్యం తగ్గిపోతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది. రక్త సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గుండెకు మంచి చేస్తుంది. గొంతు సంబంధ సమస్యలతో బాధపడేవారికి ఆ సమస్యలు నయం చేస్తుంది. 

సహజంగానే జున్నులో ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, జీర్ణమవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. జీర్ణశక్తి సరిగా లేనివారు  దీన్ని తిన్నప్పుడు అది సరిగా అరగకపోగా వాతదోషం కఫదోషాలు పెరిగి, శరీరం బరువెక్కడం, మలబద్దకం, కడుపునొప్పి, కడుపులో  బరువు ఏదో తెచ్చిపెట్టినట్లు అనిపించడం… వంటి బాధల్ని కల్గిస్తుంది. వాతదోషం పెరిగి, కాళ్ళు చేతులు నొప్పులు, కీళ్ళు వాచిపోవడం, నడుంనొప్పి, శరీరం కదలకుండా బిగుసుకు పోయినట్లవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.


అందుకని, జున్నుపాలు కాచేప్పుడే అందులో కొద్దిగా మిరియాల పొడిని కలిపి జున్ను తయారుచేస్తారు. దీనివల్ల తేలికగా అరిగేందుకు ఈ మిరియాల పొడి సహకరిస్తుంది. వాతకఫ దోషాలను పెరగకుండా అదుపులో వుంచుతుంది. ఈ బాధలున్నవారు జున్నును పరిమితంగా తినాలి. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే, పాత రోగాలు తిరిగి మొదలయ్యేలా చేస్తుందని జున్ను గురించి హెచ్చరిస్తారు వైద్యులు. ఇదీ జును రహస్యం… 


                                  ◆నిశ్శబ్ద



Source link

Leave a Comment