సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ కెరీర్ కి జైలర్ మూవీని ఒక రకంగా కమ్ బ్యాక్ మూవీగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే వరుస ప్లాప్ ల తర్వాత రజనీ సత్తా చూపించిన సినిమాగా జైలర్ నిలిచింది. ఆ మూవీకి సీక్వెల్ ఉంటుందని కొన్నాళ్ళ క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పడు ఒక హీరోయిన్ అది నిజం అని చెప్తుంది. దీంతో రజనీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
గత సంవత్సరం అగస్ట్ 9 న వచ్చిన జైలర్ రజనీ కెరిరీలోనే అత్యథిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.రజనీ పవర్ ఫుల్ యాక్టింగ్ కి సిల్వర్ స్క్రీన్ మొత్తం దాసోహమయ్యింది. పాన్ ఇండియా లెవల్లో రికార్డులు కొల్లగొట్టిన ఆ మూవీలో రజనీ కోడలుగా చేసి మెప్పించిన నటి మిర్న మీనన్. ఈమె చాలా సినిమాల్లో హీరోయిన్ గాను చేసింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు జైలర్ దర్శకుడు నెల్సన్ తో ఇటీవలే మాట్లాడానని ఆయన ప్రస్తుతం జైలర్ 2 స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నారని చెప్పింది. అయితే పార్ట్ 2 లో తాను ఉన్నానో లేదో తెలియదని అది దర్శకుడు చేతిలోనే ఉందని చెప్పింది. ఈమె చెప్పిన మాటలతో జైలర్ 2 పక్కాగా ఉంటుందనే విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది.
ఇప్పుడు పార్ట్ 2 లో ఎవరెవరు రజనీ తో కలిసి స్క్రీన్ పంచుకుంటారనే విషయంలో కూడా చాలా మందిలో క్యూరియాసిటీ ఏర్పడింది. రౌడీలని దారికి తెచ్చే పోలీస్ ఆఫీసర్ గా, సంఘవిద్రోహ శక్తులతో చేతులు కలిపిన సొంత కొడుకుని సైతం చంపేసే వ్యక్తిగా పార్ట్ 1 లో రజనీ నటన ఎక్స్ట్రార్డినరీ గా ఉంటుంది. మరి పార్ట్ 2 లో ఎలాంటి కథతో వస్తారో చూడాలి.