దిశ, ఫీచర్స్ : వయసు పెరిగే కొద్దీ మతిమరుపు వస్తుంది. మెదడు కూడా బలహీనంగా మారి క్షీణిస్తుంది. మీరు జ్ఞాపకశక్తిని కోల్పోతే, మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇలా చేయడం వలన ఆక్సిజన్ మెదడుకు చేరుతుంది. కాబట్టి, మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవడానికి వీటిని పాటించండి. అవేంటో ఇక్కడ చూద్దాం..
1. జ్ఞాపకశక్తి సమస్యతో బాధపడేవారు యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్, వ్యాయామం వంటి క్రీడలు చేయాలి. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
2. ధ్యానం మీ శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది మరియు ఉదయాన్నే ధ్యానం చేయండి
3. మెదడు పనితీరును పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం. రోజూ వాకింగ్‌కి వెళ్లాలని నిర్ధారించుకోండి. మీరు తేలికపాటి వ్యాయామం కూడా చేయాలి.
4. మీరు మాంసాహారులు అయితే, మీరు చేపలను తప్పనిసరిగా తినాలి. ఆలివ్ ఆయిల్, నట్స్, విటమిన్లు, మినరల్స్ ఉండే ఫుడ్స్ ని ఆహారాన్ని తీసుకోండి. మద్యం , స్మోకింగ్జం, క్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.