Health Care

జ్వరం రావడం కూడా ఒకింత మంచిదే.. ఎందుకంటే..


దిశ, ఫీచర్స్ : వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందని, ఆ తర్వాత ఫీవర్ వస్తుందని మనం భయపడుతుంటాం. సీజన్‌తో సంబంధం లేకుండా కూడా అప్పుడప్పుడూ పిల్లలకు, పెద్దలకు జ్వరాలు వస్తుంటాయి. ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కొందరికి ఒకట్రెండు రోజుల్లో తగ్గుతుంటాయి. కానీ ఆలోగానే మనం కంగారు పడిపోతాం. ఇంకా ఎక్కువ అవుతుందేమోనని ఆందోళన చెందుతుంటాం. అయితే ఇలా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఫీవర్ రావడం కూడా ఒకింత మంచిదేనని పేర్కొంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం.

* టాక్సికాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ హెల్త్ స్టడీ ప్రకారం.. వారు జ్వరం రావడంవల్ల రోగ నిరోధక వ్యవస్థ అలర్ట్ అవుతుందని, వ్యాధిని ఎదుర్కొనేలా ట్రైనింగ్‌ పొందుతుందని నిపుణులు గుర్తించారు. దీంతో మరోసారి జ్వరం వచ్చినప్పుడు ఇమ్యూనిటీ సిస్టం మరింత అప్రమత్తంగా వ్యాధులను ఎదుర్కోగలదని కనుగొన్నారు. ఎక్స్‌పరిమెంటల్ మెడిసిన్ స్టడీలోనూ ఇదే వెల్లడైంది.

* ఫీవర్ సమయంలో కొన్నిరకాల వైరస్‌లు లేదా సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశిస్తాయి. శరీరంలోని రోగ నిరోధక కణాలు వాటిని ప్రతిఘటించే క్రమంలో ప్రత్యేక ప్రోటీన్‌తో తమను తాము పోషించుకుంటాయి. బలంగా తయారవుతాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్‌ను మరింత పెరుగుతుందని నేచర్ రివ్యూస్ మాలిక్యులర్ సెల్ బయాలజీ స్టడీలో వెల్లడైంది.

* బాడీ టెంపరేచర్ పెరగినప్పుడు మెటబాలిక్ సిస్టం పనితీరు మరింత మెరుగు పడుతుంది. అంతేకాకుండా మల మూత్రాల విసర్జన, చెమటలు పట్టడం వంటి కారణాలతో బాడీలోని టాక్సిక్ మెటల్స్ బయటకు పోతాయి. శరీరంలో పెరిగిన వేడి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా హానికారక సూక్ష్మజీవుల యాక్టివిటీని అడ్డుకొని, రోగ నిరోధక కణాల యాక్టివిటీని పెంచుతుంది.

* జ్వరం వచ్చినప్పుడు సైటో కాయిన్స్ అనే ప్రొటీన్ కూడా శరీరంలో యాక్టివేట్ అవుతుందని, ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ అణువులను శరీరంలో రిలీజ్ చేస్తుందని కెమికల్ ఇన్వెస్టిగేషన్ స్టడీస్ పేర్కొంటున్నాయి. అయితే సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు ఉండాలి. కానీ ఫీవర్ వచ్చినప్పుడు ఇది పెరుగుతుంది. దీనివల్ల ఇన్‌ఫ్లూయెంజా వంటి సూక్ష్మజీవులు శరీరంలో విస్తరించడం ఆగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి ఫీవర్ రావడంవల్ల ఇమ్యూనిటీ సిస్టమ్‌, దానికి రక్షణగా ఉండే వైట్ బ్లడ్‌సెల్స్ అలర్ట్ అవుతాయి. వ్యాధికారక బ్యాక్టీరియాలు, వైరస్‌లతో పోరాడుతాయి. కాబట్టి జ్వరం రావడం కూడా ఒకింత మంచిదేనని నిపుణులు చెప్తున్నారు.

* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అందులోని విషయాలను ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.



Source link

Related posts

జియోలో వాయిస్​ బ్రేక్​ సమస్యకు కారణమిదే..

Oknews

వేసవిలో జింజర్, లెమన్ వాటర్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..

Oknews

AI ‘Ghosts’.. చనిపోయిన వ్యక్తులతో మాట్లాడించే చాట్‌బాట్ అవతార్‌లు.. మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపుతాయంటున్న నిపుణులు

Oknews

Leave a Comment