టమాటాలో దాగి ఉన్న ఆరోగ్యం… | Health benefits of tomatoes|Nutrition Facts and Health Benefits|Health Properties of Tomatoes|Surprising Sources of Vitamin A


posted on Mar 6, 2024 9:34PM

టమాటాతో చేసే వంటకాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎలాంటి వంటకమైన టమాట వేస్తే చాలు దానికి రుచి వచ్చేసినట్లే. కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట ఈ టమాట.టమాటా లలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు ఎక్కువ మోతాదులో ఉంటాయట.ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. టమాటాల్లో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు.

టమాటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.టమాటాని చక్రాలుగా తరికి కళ్ళ మీద పెట్టుకున్నా కళ్ళకి చల్లదనం లభిస్తుంది. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి  రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి.వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది.

 

 

ఆడవారికి నచ్చే మరో విషయం ఏమిటో తెలుసా? ప్రతిరోజూ తినే ఆహారంలో టమాటా  తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు. టమాటాలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను ఎక్కువగా తినలేరు. ఇవి తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని , ఇతర పదార్దములు గాని తిననీయదు.  కాబట్టి ఆకలి మీద నియంత్రణ ఉండి, తక్కువగా తింటారు.


 

మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి,విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయులను నియంత్రించే మాంగనీసులాంటివి కూడా పుష్కలంగా ఉన్నాయట.

టమాటాల్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది కదూ. అసలే టమాటాల సీజన్. ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పని మొదలుపెట్టేద్దాం.

……కళ్యాణి



Source link

Leave a Comment