Entertainment

టాలీవుడ్‌కి టాప్‌ డైరెక్టర్లను పరిచయం చేసిన ఘనత మాస్‌ రాజా రవితేజదే!


ఏ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం స్వయంకృషితో టాప్‌ హీరోగా ఎదిగిన వారి గురించి చెప్పాలంటే మొదటగా మెగాస్టార్‌ చిరంజీవి పేరు వినిపిస్తుంది. ఆ తర్వాతి స్థానం నిస్సందేహంగా మాస్‌రాజా రవితేజదే. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ని స్టార్ట్‌ చేసిన రవితేజ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఏ క్యారెక్టర్‌ ఇచ్చినా చేశాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్‌ హీరో రేంజ్‌కి ఎదిగాడు. సినిమా మార్కెట్‌ పరంగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రవితేజకు డైరెక్టర్‌ అవ్వాలనుకునేవారి కష్టాలేమిటో తెలుసు. డైరెక్టర్‌గా తన టాలెంట్‌ ఏమిటో ప్రూవ్‌ చేసుకోవాలని కలలు కనేవారికి రవితేజ ఓ వరంలా మారాడు. తన కెరీర్‌ బిగినింగ్‌ నుంచే కొత్త డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ వారితో సినిమాలు చేయడం ద్వారా తన కెరీర్‌ను అందంగా మలుచుకున్నాడు. 

రవితేజ కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 11 మంది డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పటి హీరోల్లో ఆ ఘనత రవితేజకే దక్కింది. మంచి కథతో వస్తే.. వారికి ఛాన్స్‌ ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. జనవరి 26న 55వ పుట్టినరోజును జరుపుకుంటున్న మాస్‌ రాజా రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు ఎవరో ఒకసారి చూద్దాం. 

1. శ్రీను వైట్ల: యాక్షన్‌ అండ్‌ కామెడీని మిక్స్‌ చేసి ఒక డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌ చెయ్యాలంటే అది శ్రీను వైట్లకే సాధ్యం అనిపించుకునే రేంజ్‌కి వెళ్లిన శ్రీను వైట్లకు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు మాస్‌ రాజా. 1999లో రవితేజ హీరోగా వచ్చిన ‘నీకోసం’ చిత్రంతో శ్రీను వైట్ల దర్శకుడిగా పరిచయమయ్యాడు.  ఈ సినిమా నాలుగు నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఇందులో శ్రీను వైట్లకు బెస్ట్‌ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, ఉత్తమ తొలి సినిమా డైరెక్టర్‌గా అవార్డులు లభించాయి. ఆ తర్వాత వెంకీ, దుబాయ్‌ శ్రీను, అమర్‌ అక్బర్‌ ఆంటోని చిత్రాన్ని వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందాయి. 

2. అగస్త్యన్‌: 2003లో వచ్చిన ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ చిత్రంతో అగస్త్యన్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేశాడు రవితేజ. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా రవితేజకు నటుడిగా మంచి పేరు తెచ్చింది. 

3. యోగి: విక్టరీ వెంకటేష్‌తో ‘చింతకాయల రవి’ వంటి చిత్రాన్ని రూపొందించిన యోగి తన మొదటి సినిమాను రవితేజతోనే చేశాడు. 2003లో వచ్చిన ‘ఒక రాజు ఒక రాణి’ చిత్రంతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. 

4. ఎస్‌.గోపాలరెడ్డి: తమిళ్‌లో చేరన్‌ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘ఆటోగ్రాఫ్‌’ చిత్రాన్ని ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ఈ చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్‌ ఎస్‌.గోపాలరెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. నటుడిగా రవితేజకు మెమరబుల్‌ మూవీగా నిలిచింది. 

5. బోయపాటి శ్రీను: మాస్‌ ప్రేక్షకుల్ని తన టేకింగ్‌తో మెస్మరైజ్‌ చేస్తూ టాప్‌ డైరెక్టర్‌గా ఎదిగిన బోయపాటి శ్రీను తొలి సినిమా రవితేజదే కావడం విశేషం. ‘భద్ర’ వంటి కమర్షియల్‌ హిట్‌తో కెరీర్‌ను స్టార్ట్‌ చేశాడు బోయపాటి. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. 

6. హరీష్‌ శంకర్‌ : టాలీవుడ్‌లోని టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న హరీష్‌ శంకర్‌ తొలి సినిమా ‘షాక్‌’. ఈ సినిమా ద్వారా హరీష్‌ శంకర్‌ను దర్శకుడిగా పరిచయం చేశాడు రవితేజ. ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ ‘మిరపకాయ్‌’ చిత్రంతో మరో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా సూపర్‌హిట్‌ అయ్యింది. 

7. సముద్రఖని : ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖనిని తెలుగులో ‘శంభో శివశంభో’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశాడు రవితేజ. తమిళ్‌లో సముద్రఖని దర్శకత్వంలోనే రూపొందిన ‘నాడోడిగల్‌’ చిత్రాన్ని రీమేక్‌ చేయడం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 

8. గోపీచంద్‌ మలినేని : రవితేజకు క్రాక్‌, బలుపు లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలు ఇచ్చిన గోపీచంద్‌ మలినేనిని 2010లో డాన్‌ శీనుతో పరిచయం చేసాడు రవితేజ. మాస్‌ రాజా అనే బిరుదుని రవితేజకు ఇచ్చింది కూడా గోపీచందే. 

9. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ): స్టార్‌ హీరోలతో వరస సినిమాలు చేస్తూ.. బిజీ డైరెక్టర్‌ అయిపోయిన బాబీని ‘పవర్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశాడు రవితేజ. 

10. విక్రమ్‌ సిరికొండ: రవితేజ కెరీర్‌లో అతను పరిచయం చేసిన డైరెక్టర్లందరూ మంచి పేరు తెచ్చుకున్నారు. కమర్షియల్‌గా విజయం సాధించిన సినిమాలను రూపొందించారు. కానీ, విక్రమ్‌ సిరికొండ ఒక్కడే ‘టచ్‌ చేసి చూడు’ చిత్రంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 

11. శరత్‌ మండవ: ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ పేరుతో శరత్‌మండవ తెరకెక్కించిన సినిమా రవితేజ కెరీర్‌లో మరో ఫ్లాప్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది. 



Source link

Related posts

'గేమ్ ఛేంజర్'కి రామ్ చరణ్ రాంరాం..!

Oknews

విశ్వక్ సేన్ లో ఈ మార్పుకి కారణం ఏంటి?

Oknews

రేషన్ కార్డు సినిమా అని తక్కువ అంచనా వెయ్యకండి..మణిశర్మ ఉన్నాడు

Oknews

Leave a Comment