బాక్సాఫీస్ దగ్గర ‘టిల్లు స్క్వేర్'(Tillu Square) జోరు కొనసాగుతోంది. మొదటి వీకెండ్ అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటిన ఈ సినిమా.. మండే టెస్ట్ కూడా పాస్ అయింది. నాలుగు రోజైన సోమవారం కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. సూపర్ హిట్ మూవీ ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా రూపొందింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 29న విడుదలై.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ టాక్ కి తగ్గట్టే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం, మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.23.7 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.21.6 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.22.8 కోట్ల గ్రాస్ రాబట్టగా.. నాలుగు రోజు రూ.9.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.78 కోట్ల గ్రాస్ సాధించింది.
బాక్సాఫీస్ దగ్గర ‘టిల్లు స్క్వేర్’ జోరు చూస్తుంటే.. మరో రెండు మూడు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరేలా ఉంది. ఫుల్ రన్ లో రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కాగా యంగ్ స్టార్స్ లో ‘గీత గోవిందం'(రూ.130 కోట్లు)తో విజయ్ దేవరకొండ, ‘దసరా'(రూ.120 కోట్లు)తో నాని.. వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరారు. అయితే ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’తో సిద్ధు.. వారి హైయెస్ట్ కలెక్షన్స్ ని బీట్ చేసేలా ఉన్నాడు.