దిశ, ఫీచర్స్ : ‘టీఎంసీ’ అనే పదాన్ని మనం తరచుగా వింటుంటాం. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డ్యాములు, రిజర్వాయర్లలో వరద నీరు చేరుతోంది. ఫలానా రిజర్వాయర్‌లో రెండు మూడు టీఎంసీల వరకు చేరి ఉంటుందని, అధికారులు బయటకు విడుదల చేశారని వార్తలు కూడా వినిస్తుంటాయి. ఇక్కడే చాలా మందికి ఓ సందేహం కూడా కలుగుతుంది. ఏంటంటే.. ఇంతకీ టీఎంసీ (TMC) అంటే ఏమిటి?
నిపుణుల ప్రకారం.. రిజర్వాయర్లలో నీటిని కొలిచేందుకు టీఎంసీ అనే షార్ట్‌కట్ పదాన్ని వాడుతారు. దీని పూర్తిపేరు ‘thousand million cubic feet’ (వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు). అంటే నీటి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే యూనిట్. Tmc, అలాగే Tmcft అని కూడా పిలుస్తుంటారు. ఒక మిలియన్ క్యూబిక్ అడుగులు అంటే.. టోటల్‌గా 1000 ఫీట్ల పొడవు, 1000 ఫీట్ల వెడల్పు, అలాగే 1000 ఫీట్ల ఎత్తు వరకు కలిగి ఉండే నీటి పరిమాణం. లీటర్లలో పరిగణిస్తే ఒక టీఎంసీ దాదాపు 2,881 కోట్ల లీటర్లు (ఘనపుటడుగులు) అవుతుంది. 2,300 ఎకరాల విస్తీర్ణంలో ఒక అడుగు మందం నీరు చేరితే గనుక దానిని ఒక టీఎంసీ నీటికి సమానంగా పరిగణించవచ్చునని నిపుణులు చెప్తున్నారు.