టీటీడీ ఆదాయ అంచనాలు
అయితే శ్రీవారి హుండీ కానుకల ద్వారా రూ. 1,611 కోట్లు వస్తాయని టీటీడీ అంచనా వేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రూ.1,167 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.600 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కల్యాణకట్ట రసీదుల ద్వారా రూ.151.50 కోట్లు, గదులు, కల్యాణమండపం ద్వారా రూ.147 కోట్లు, శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల విక్రయాల ద్వారా రూ.448 కోట్లు ఆదాయం వస్తుందని పాలకమండలి అంచనా వేసింది. పుస్తకాల విక్రయాల ద్వారా రూ.35.25 కోట్లు,అగర్బత్తి, టోల్ గేట్, విద్య కళాశాల ద్వారా రూ.74.50 కోట్లు ఆదాయం వస్తుందని బోర్డు భావిస్తోంది.