మైలవరం టికెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ముందుకు తీసుకెళ్లే సత్తా చంద్రబాబుకే ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. రాష్ట్రం ప్రగతి మార్గంలో ముందుకు వెళ్లాలంటే పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు రావాలన్నారు. ఇవన్నీ చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. మైలవరంలో గత నాలుగేళ్లుగా వైకాపా ఎమ్మెల్యేగా ఆ పార్టీ నిర్మాణం, అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అయినా తనకు వైసీపీలో ప్రాధాన్యత లభించలేదన్నారు. మైలవరం (Mylavaram)నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం జగన్ ఎన్నో వినతులు ఇచ్చానని, కానీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరానన్నారు. మైలవరం నుంచి పోటీపై వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అన్ని సర్వేల్లోనూ మైలవరంలో తానే గెలుస్తానని వచ్చిందన్నారు. సీఎం జగన్ టికెట్ ఇస్తానన్నా వద్దని వచ్చేశానన్నారు. చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తానని, లేదంటే పార్టీ కోసం పనిచేస్తానన్నారు.