Top Stories

టీడీపీ ఎమ్మెల్యే గుట్టు రట్టు చేసిన వైసీపీ


తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే వరసగా మూడు సార్లు గెలుస్తున్నారు అంటే ఆయన జనాదరణ గ్రేట్ అని అంతా అనుకుంటారు. ఆయన ఎవరో కాదు విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు. ఆయన విజయవాడ నుంచి విశాఖకు వలసవచ్చిన నేత. ఆయన 2009 నుంచి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.

ఈసారి ఆయన ఓటమి ఖాయమని వైవీ సుబ్బారెడ్డి జోస్యం చెప్పారు. ఆ గెలుపు వెనక గుట్టు రట్టుని చేశారు. తూర్పులో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇరవై వేలకు పైగా దొంగ ఓట్లు తూర్పులో ఉన్నాయని అంటున్నారు. వాటి మీద పోరాటం చేస్తున్నామని అన్నారు.

ఈ భోగస్ ఓట్లకు చెక్ పెడితే టీడీపీ అక్కడ ఓటమి పొందడం ఖాయమని ఆయన అంటున్నారు జగన్ని మరోసారి సీఎం గా ఎందుకు ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారో వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అయిదేళ్ల పాటు నిరాటంకంగా అందిస్తున్న సంక్షేమ పధకాలు కొనసాగడానికే జగన్ కి ఓట్లు వేయడానికి ప్రజలు డిసైడ్ అయ్యారని అన్నారు.

చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉంటే సానుభూతి వస్తుందని భావించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని వైవీ విశ్లేషించారు. తప్పు చేసి జైలుకు వెళ్ళిన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్  పొత్తు పెట్టుకోవడం విడ్డూరంగా ఉంది అన్నారు పవన్ చంద్రబాబు తప్పులను ఏ విధంగా సపోర్ట్ చేస్తారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మీద పవన్ విమర్శలు తగవని ఆయన హితవు పలికారు.



Source link

Related posts

దేశంలోనే అత్యంత పిన్నవయస్కుడైన అవయవదాత

Oknews

ఈ దె…భాష ఏంటి అయ్యన్నా…!?

Oknews

భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణిల‌పై సీఐడీ భారీ స్కెచ్‌!

Oknews

Leave a Comment