Top Stories

టీడీపీ నేత‌ల్లారా ఆ కోరిక వ‌ద్దు.. త‌థాస్తు దేవ‌త‌లుంటారు!


రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీ ఎలాంటి కుట్ర‌ల‌కైనా తెర‌లేపుతుంది. ఈ వాస్త‌వాన్ని చ‌రిత్రే చెబుతోంది. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ప్రాణాలు పోవ‌డానికి కార‌కులైన వారే ఇప్పుడు ఆ పార్టీకి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అనే సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు అరెస్ట్ చుట్టూ ఎంత‌గా రాద్ధాంతం చేసినా రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పెద్ద‌గా లేద‌ని టీడీపీ నేత‌లు గ్ర‌హించారు. దీంతో కొత్త ఎత్తుగ‌డ‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చావు గురించి మాట్లాడ్డానికి కూడా వెనుకాడ‌డం లేదు. టీడీపీ సీనియ‌ర్ నేత‌లు అమ‌ర్నాథ్‌రెడ్డి, వ‌ర్ల రామ‌య్య ఏకంగా స‌మావేశాల్లోనే చంద్ర‌బాబు మ‌ర‌ణించార‌ని మాట్లాడ్డాన్ని వింటున్నాం. బాబు అరెస్ట్ అంశాన్ని ప‌క్క‌న పెట్టి, ఆయ‌న మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక జ‌నం పిట్ట‌ల్లా రాలుతున్నార‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌లే వాపోతున్నారు.

తాజాగా చంద్ర‌బాబు త‌న ఆరోగ్యం, భ‌ద్ర‌త‌కు సంబంధించి అనుమానాల్ని వ్య‌క్తం చేస్తూ ఏసీబీ జ‌డ్జికి జైలు అధికారుల ద్వారా లేఖ పంపడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇదంతా ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే జ‌రుగుతోంద‌ని టీడీపీ నేత‌ల స్పంద‌న తెలియ‌జేస్తోంది. మీడియా ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన చిట్‌చాట్‌లో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జైల్లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలను గ‌మ‌నిస్తే చంద్ర‌బాబు భ‌ద్ర‌త విష‌యంలో త‌మ‌కు ఆందోళ‌న క‌లుగుతోంద‌న్నారు. 

చంద్ర‌బాబును అంతం చేసేందుకు కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయ‌నే లేఖ‌లు వ‌చ్చినా విచారించ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. జైల్లో వ్య‌క్తుల్ని చంపేయ‌డంలో సీఎం జ‌గ‌న్ , ఆయ‌న అనుచ‌రులు ఆరితేరార‌ని ఆరోపించారు. జైల్లో ఉన్న వాళ్ల‌ని సైలెంట్‌గా లేపేస్తార‌ని ఆయ‌న ఆరోపించారు. చంద్ర‌బాబును కూడా అట్లే అంత‌మొందిస్తార‌నే అనుమానాన్ని అచ్చెన్నాయుడు వ్య‌క్తం చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో చంద్ర‌బాబు ఉన్నార‌ని, అలాంట‌ప్పుడు ప్ర‌భుత్వానికి ఏం ప‌ని అని ఆయ‌న నిల‌దీశారు. సజ్జల డైరెక్షన్లో ఏదో జ‌రుగుతోంద‌న్న ఆందోళన కలుగుతోందన్నారు. చంద్రబాబు చాలా వరకు బరువు తగ్గారని ఆయ‌న చెప్పుకొచ్చారు.

టీడీపీ నేత‌ల మాట‌లు వింటుంటే ఇక‌పై చంద్ర‌బాబు చావు చుట్టూ రాజ‌కీయాలు చేస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. రాజ‌కీయ స్వార్థంతో టీడీపీ నేత‌లు ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తార‌నే అనుమానాన్ని వైసీపీ వ్య‌క్తం చేస్తోంది. బాబు ప్రాణాల్ని కాపాడుకోవ‌డం టీడీపీ కంటే వైసీపీకి ముఖ్య‌మ‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లోనే చంద్ర‌బాబు వుంటే, ఇలాంటి చావు రాజ‌కీయాలు ఇంకెన్ని చూడాల్సి వుంటుందో! బాబు చావు కోరుకోవ‌ద్ద‌ని, పైన త‌థాస్తు దేవ‌త‌లు వుంటార‌ని వైసీపీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు.



Source link

Related posts

ఆయన్ని సీఎం చేయడం కోసం రంగంలోకి స్వామి

Oknews

ఈ దె…భాష ఏంటి అయ్యన్నా…!?

Oknews

రెండు కుటుంబాలకు ఒకేసారి టీడీపీ షాక్…!

Oknews

Leave a Comment