Andhra Pradesh

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం-amaravati gajuwaka mla palla srinivasa rao appointed tdp state president ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ

ఇప్పటి వరకూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు కేబినెట్ లో స్థానం దక్కింది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు మరొకరికి అప్పగించాలని చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక నుంచి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీగా గెలిచిన పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోని అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన పల్లా శ్రీనివాసరావు పార్టీ కోసం చాలా శ్రమించారు. ఒకానొక దశలో ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రత్యర్థులు ప్రచారం కూడా చేశారు. అయినా పార్టీని విడలేదు.



Source link

Related posts

SSC Students: APలో స్క్రైబ్ లేకుండానే పది పరీక్షలు రాసిన దివ్యాంగులు… కంప్యూటర్‌ సాయంతో డిజిటల్ పరీక్షలు

Oknews

NATA 2024: నేషనల్ ఆప్టిట్యూట్ టెస్ట్‌ ఫర్ ఆర్కిటెక్చర్‌‌కు దరఖాస్తు చేశారా?

Oknews

బాబొచ్చినా ఏపీలో ఇసుక భారం తగ్గలేదు, రెట్టింపైన రిటైల్ మార్కెట్ ధరలు, తెరుచుకోని రీచ్‌లు-sand reaches reduced in ap prices double retail market ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment