Health Care

టీనేజర్స్‌లో యాంగ్జైటీ.. ఎదుర్కోవడానికి ఏడు మార్గాలు


దిశ ఫీచర్స్ : మానసిక ఆరోగ్యం మానవ జీవితానికి ఎంతో ముఖ్యం. ఆందోళన, ఒత్తిడి వంటివి సహజమే అయినప్పటికీ, ఆనందంగా ఉండగలిగితేనే వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఏర్పడుతుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిపుణుల ప్రకారం.. ఇటీవల టీనేజర్లలో మానసిక ఆందోళన పెరుగుతోంది. 13 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకుల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది యాంగ్జైటీ డిజార్డర్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి టీనేజర్ల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని మేనేజ్ చేయడానికి లేదా ఎదుర్కోవడానికి నిపుణులు సూచిస్తు్న్న ఏడు మార్గాలేమిటో చూద్దాం.

లిమిట్స్‌ పెంచుకోండి

కొన్నిసార్లు ఆయా పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియక, అవగాహన లేకకూడా టీనేజర్లలో యాంగ్జైటీస్ పెరుగుతున్నాయి. అందుకోసం వాటిని తట్టుకోవడానికి అవసరమైన శక్తి కావాలి. కాబట్టి ఆందోళనను రేకెత్తించే కార్యకలాపాలలో నిమగ్నమవ్వడం ద్వారా క్రమంగా మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అలాగని ఒకేసారి మరీ ఎక్కువ ఛాలెంజింగ్ విషయాల జోలికి వెళ్లవద్దు. మీ కాన్ఫిడెంట్‌ను పెంపొందించుకోవడానికి సాధించగల గోల్స్ ఏర్పర్చుకోవడంలో మరింత క్లిష్టమైన పనులను అధిగమించడంలో కాస్త ఎక్కువ శ్రమించండి. ఇలాంటి యాంగ్జైటీ-ప్రేరేపిత పరిస్థితులకు స్థిరంగా, కుమిలి పోకుండా ఉండటం నేర్చుకోవడం ద్వారా కాలక్రమేణా యాంగ్జైటీని మేనేజ్ చేయడం, ఎదుర్కోవడం ఈజీ అవుతుంది.

ఆనందాన్నిచ్చే పనులపై ఫోకస్

ఎప్పుడూ ఆందోళన కలిగించే విషయాలే ఆలోచించడం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్యంగా రాబోయే పరీక్షలు, ప్రెజెంటేషన్‌లు లేదా ముఖ్యమైన సమావేశాలు వంటివి మీలో కాస్త ఆందోళన కలిగించేవిగా ఉండవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి అంతకుముందు ఆనందించే లేదా ఆసక్తికరమైన కార్యకలాపాలలో కూడా పాల్గొంటూ ఉండండి. ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవ్వడం, మీకు నచ్చే వీడియోలు లేదా కామెడీ సిరీస్ చూడటం, ఇష్టమైన సంగీతం వినడం వంటి చేయడం ద్వారా మీలోని యాంగ్జైటీ లెవల్స్ తగ్గుతాయి.

నలుగురిలో కలిసిపోవడం..

మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు సరదాగా గడిపే ప్రయత్నం చేయండి. అవసరమైతే నలుగురిలో కలిసి గడపడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు యోగా, డ్యాన్స్ క్లాస్ వంటివి మీలోని ఆందోళనను తగ్గిస్తాయి. ఒంటరిగా లేదా స్నేహితులతో కలిసి వాకింగ్ చేయడం యాంగ్జైటీకి విరుగుడుగా పనిచేస్తుంది. వివిధ ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం వల్ల ఒత్తిళ్ల నుంచి మీ దృష్టిని మళ్లించవచ్చు. అల్లకల్లోలమైన భావోద్వేగాలను ఇది తగ్గిస్తుంది. తక్కువ శారీరక శ్రమతో పోలిస్తే, టీనేజర్లలో అధిక స్థాయి శారీరక శ్రమను నిర్వహించే వారు యాంగ్జైటీ లక్షణాలను అభివృద్ధి చేసే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

నిపుణులు, పేరెంట్స్‌తో చర్చించండి

మీ సమస్యలు లేదా ఆందోళనల గురించి అర్థం చేసుకుని, పరిష్కారం చూపగల నిపుణులు, స్నేహితులు, ఇతర వ్యక్తులతో మాట్లాడండి. పేరెంట్స్ మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితుల నుంచి తప్పించడంలో అందరికంటే బెటర్‌గా సహాయపడతారనేది కూడా గుర్తుంచుకోండి. అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడంవల్ల ప్రతికూల భావోద్వేగాలను తగ్గించడంలో, ఆందోళనను మేనేజ్ చేయడంలో సహాయపడుతుంది.

మిమ్మల్ని మీరు తెలుసుకోండి

మీ బలాలు, బలహీనతలను డాక్యుమెంట్ చేయడం ద్వారా, గుర్తించడం ద్వారా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవచ్చు. ఇటువంటి చర్యలవల్ల సెల్ఫ్-రిఫ్లెక్షన్స్‌లో పాల్గొనండి. వీక్‌నెస్‌లను అధిగమించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఇది దోహదం చేస్తుంది. ప్రతికూల అంశాలను స్పష్టంగా గుర్తించడం, నివారించడం అనేది స్వీయ-అభివృద్ధి కోసం అవసరమైన గోల్స్ సెట్ చేసుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

సమతుల్య జీవనశైలిని అలవర్చుకోండి

క్రమం తప్పకుండా ఫిజికల్ యాక్టివిటీ, తగినంత నిద్ర కలిగి ఉండటం, అలాగే విటమిన్లు, మినరల్స్‌తో కూడిన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం టీనేర్లలోని ఆందోళనలను తగ్గిస్తాయి. ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి ఒత్తిడిని, యాంగ్జైటీని తట్టుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.

హెల్ప్ అడగడంలో తప్పులేదు

ఆందోళన చెందుతున్నప్పుడు మీరు ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు ఇతరుల హెల్ప్ అడగడంలో తప్పులేదు. రిస్థితులు విపరీతంగా మారుతున్నాయని మీరు భావిస్తే, మీ స్నేహితులను, నిపుణులను, కొలీగ్స్‌ను హెల్ప్ కోసం సంప్రదించవచ్చు. మన సొసైటీలో మెంటల్ హెల్త్ తరచుగా నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ సహాయం కోసం అడగడం కొన్నిసార్లు అవమానంగానో, నిషిద్ధమైనదిగానే భావించేవారు కూడా ఉంటారు. కానీ ఇది తప్పు. టీనేజర్స్ ఆందోళనను ఎదుర్కోవడంలో ఇతరుల సపోర్టును తప్పక కోరవచ్చు. మెరుగైన భవిష్యత్తుకోసం యాంగ్జైటీని ముందుగానే గుర్తించడం, పరిష్కరించడం చాలా ముఖ్యం. లేకపోతే ఇది డిప్రెషన్ లేదా ఇతర మానసిక సమస్యల ప్రారంభ సంకేతం కూడా కావచ్చు



Source link

Related posts

‘మటన్ తినకపోతే మనోడి బౌలింగ్ స్పీడ్ తగ్గుతుంది’.. స్టార్ బౌలర్ ఫ్రెండ్ షాకింగ్ స్టేట్‌మెంట్

Oknews

మొగుడు తప్ప అందరూ కావాలి.. అలాంటి వీడియో షేర్ చేస్తూ ఆ వ్యక్తి చేసిన పనికి.. (వీడియో)

Oknews

చైనాలో కుక్కలకు పెళ్లిళ్లు.. తీవ్రంగా నష్టపోతున్న దేశం…

Oknews

Leave a Comment