మార్పు మొదలైంది”మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అని ప్రజలకు తేల్చి చెప్పాం.ప్రజా సంఘాలతో ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు స్వీకరించాం. ఈ ప్రభుత్వంలో అందరినీ భాగస్వాములను చేస్తున్నాం. మార్పు మొదలైంది.. మార్పు జరుగుతోంది అని ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాం. విభజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నాం. తెలంగాణ (Telangana)హక్కుల సాధన కోసం ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సంప్రదింపులు జరుపుతున్నాం. కేంద్రంతో, పక్క రాష్ట్రాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. జయజయహే తెలంగాణ గీతాన్ని(TG Song) రాష్ట్ర గీతంగా ఆమోదించుకున్నాం. తెలంగాణ అభివృద్ధికి మా మంత్రులు, ఎమ్మెల్యేలు కష్టపడి పని చేస్తున్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి వైబ్రంట్ తెలంగాణ-2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం”- సీఎం రేవంత్ రెడ్డి
Source link