దిశ, ఫీచర్స్ : టైప్ -2 డయాబెటిస్ వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ పెరిగే అవకాశం ఉందనేది అందరికీ తెలిసిందే. కానీ వెన్ను నొప్పికి కూడా కారణం అవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవుల్లో టైప్ 2 డయాబెటిస్ డెవలప్ కావడానికి, నడుము నొప్పితో బాధపడటానికి మధ్య గల ఆశ్చర్యకరమైన సంబంధాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ డియాగోలకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు.
డీజనరేటివ్ రిస్క్
వెన్నుపూస కాలమ్‌పై, ముఖ్యంగా ఇంటర్‌వెటెబ్రల్ డిస్క్‌లపై టైప్ -2 డయాబెటిస్ ఎలా ప్రభావం చూపుతుందో పరిశోధకులు పరిశీలించారు. కాగా ఈ సందర్భంగా డిస్క్ డీజనరేటివ్ రిస్క్ పెరుగుతున్నట్లు, అది క్రమంగా వెన్నెముక క్షీణతకు దారితీస్తున్నట్లు గుర్తించారు. దీంతో అధిక నడుము నొప్పికి దారితీస్తున్నట్లు వెల్లడించారు. మధుమేహ బాధితుల్లో వెన్నెముక డిస్క్‌లలో బయోమెకానికల్ మార్పులపై తమ పరిశోధన కీలకమైన కొత్త అంతర్దృష్టులను అందించిందని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు.
వైకల్యానికి మరొక కారణం
వాస్తవానికి ఇంటర్వర్ టెబ్రల్ డిస్క్‌లు వెన్నెముక ఎముకల మధ్య కుషన్‌లుగా పనిచేస్తాయి. ఫ్లెక్సిబిలిటీని, షాక్‌లను నియంత్రిస్తుంటాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ బాధితుల్లో ఇవి దృఢంగా మారతాయి. కొన్నిసార్లు అకాల ఆకృతిని సంతరించుకుంటాయి. ఈ క్రమంలో అవి ఒత్తిడిని సమర్థవంతంగా మేనేజ్ చేయగల వ్యక్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ విధమైన డిస్క్ బిహేవియరల్ మార్పులు డయాబెటిక్ రోగులలో నడుము నొప్పిని పెంచుతాయి. ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి ఇది కూడా ఒక కారణం అవుతోందని నిపుణులు చెప్తున్నారు. డయాబెటిస్‌లో డిస్క్ క్షీణతను అర్థం చేసుకోవడం ద్వారా నివారణ చర్యలు, చికిత్సల అభివృద్ధిపై పరిశోధకులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు.