Health Care

ట్రైన్‌లో సేఫ్ జర్నీ కోసం ఏ కంపార్ట్‌మెంట్ ఎంచుకోవాలి?


దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నందున సోషల్ మీడియాలో వాటి గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డార్జిలింగ్‌లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ పలువురిలో ఆందోళనకు కారణమైంది. దీంతో సురక్షిత ప్రయాణం కోసం ట్రైన్‌లో ఏ బోగీని ఎంచుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే సందేహాలను వ్యక్తం అవుతున్నాయి. దీనిపై నిపుణులు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా సూదూర ప్రయాణాలకు, విహార యాత్రలకు వెళ్లేవారు ఎక్కువగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. పైగా ఇది సేఫ్ జర్నీకి ప్రత్యామ్నాయంగానూ భావిస్తారు. కానీ ఇటీవల జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే చాలామంది సురక్షిత రైలు ప్రయాణం కోసం ట్రైన్‌లోని ఏ బోగీలో కూర్చోవాలనే అంశంపై గూగుల్ సెర్చ్ చేస్తున్నారట. ఇక సేఫ్ కంపార్ట్‌మెంట్ల విషయానికి వస్తే B1, B2, B3, B4 కోచ్‌లు పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. పైగా ఇవన్నీ ఏసీ బోగీలే. ప్యాంట్రీ కార్ ఉన్న ట్రైన్లలో బీ4 కోచ్ తర్వాత ఎస్1, ఎస్2, ఎస్3 అనే స్లీపర్ కోచ్‌లు కూడా వస్తాయి. ఇవి పబ్లిక్ బాక్స్‌లుగా పేర్కొనే జనరల్ బోగీలతో కలిపి ఉంటాయి. ఇక వీటిలో ఏ కంపార్ట్‌‌మెంట్ జర్నీ సేఫ్ ? అన్నప్పుడు చాలా మంది ప్రయాణికులు ఎస్1 చాలా సురక్షితమైందని చెప్తుంటారు. కానీ దీనికంటే ట్రైన్ మధ్య భాగంలో ఉండే బి4 బోగీ అత్యంత సురక్షితమైందని నిపుణులు చెప్తున్నారు.

నిజానికి ప్రమాదాల సమయంలో సైడ్ కంపార్టుమెంట్లు హాని కలిగిస్తాయని చెప్తుంటారు. కాబట్టి టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మధ్య భాగంలో ఉన్న కంపార్ట్ మెంట్ ఏది? అని తెలుసుకొని బుక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇక సీట్ల విషయానికి వస్తే ఒక ట్రైన్‌లో 72 సీట్లు ఉంటే.. వీటిలో 32 నుంచి 35 వరకు సీట్లు చాలా సేఫ్‌గా పరిగణిస్తారు. అంటే ప్రమాదాల సమయంలో ఈ సీట్లల్లో కూర్చునే వారు గాయపడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రైలు ప్రయాణం చేసేవారు సేఫ్ కంపార్టుమెంట్ల గురించి సమాచారం ముందే తెలుసుకొని బుక్ చేసుకోవడం ఒకింత మేలు చేస్తుంది.



Source link

Related posts

పచ్చి మిర్చితో మానసిక ఆరోగ్యం | Green Chilly Helps To Maintain Mental Health

Oknews

పెళ్లైన వారితో డేటింగ్‌‌.. ప్రాబ్లమ్స్ తప్పవంటున్న నిపుణులు

Oknews

చిన్న వయస్సులోనే తెల్లజుట్టు ఎందుకు వస్తుంది?.. రాకుండా ఏం చేయాలి?

Oknews

Leave a Comment