Health Care

ట్రైన్ ఎప్పుడు రిటైర్‌ అవుతుందో తెలుసా..?


దిశ, ఫీచర్స్: రిటైర్మెంట్ అనేది ప్రతి వ్యక్తికి సర్వసాధారణం. చేసే ఏ పనిలో అయినా ఓ సమయం వచ్చాక మూలన పడటం ఖాయం. ముఖ్యంగా మనుషులు, జంతువుల్లో ఈ అంశం కామన్‌గా కనిపిస్తుంది. మనుషులు అయితే.. వయస్సు సహకరించినంత కాలం పనులు చేస్తారు. ఆ తర్వాత రిటైర్మెంట్ అనివార్యం అవుతుంది. కొందరైతే జీవించినంత కాలం కూడా పనిచేస్తారు.

జంతువులు కూడా కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి. ఉదాహరణకు పశువుల విషయానికొస్తే.. గతంలో వీటిని పొలం పనులకు వాడుకునే వారు. ఒక్కో దానిని కనీసం ఐదారేళ్లు పొలం పనులకు వాడుకునేవారు. ఆ తర్వాత అవి క్రమంగా అనారోగ్యం బారిన పడటం మనం చూస్తుంటాం. అంతేకాదు.. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొంతకాలమే వాడుకలో ఉంటాయి.

అయితే, అందరికీ రైలు రిటైర్మెంట్ గురించి పెద్దగా తెలిసి ఉండదు. ట్రైన్ లు ఎంతకాలం వాడుకలో ఉంటాయి. అవి ఎప్పుడు రిటైర్మెంట్ అవుతాయి. ఒక్కో ట్రైన్‌ను ఎంతకాలం వాడుకుంటారో ఈ వార్తలో తెలుసుకుందాం. భారతీయ రైల్వేలు ఆసియాలో రెండవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. అదే ప్రపంచంలో అయితే నాల్గొవది. భారత దేశంలో రోజూ 23 మిలియన్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే, ICF కోచ్‌ల జీవితకాలం 25 నుండి 30 సంవత్సరాలు.

అంటే ఒక ప్యాసింజర్ కోచ్ గరిష్టంగా 25 నుంచి 30 సంవత్సరాల వరకు మాత్రమే సేవలు అందిస్తుంది. సాధారణ కోచ్‌కు 25 ఏళ్ల సర్వీసు పూర్తి కాగానే, సర్వీస్ నుంచి విడుదలవుతుంది.. దీని తర్వాత అవి ఆటో క్యారియర్లుగా వాటిని మారుస్తారు. ఆటో క్యారియర్‌గా మారిన తర్వాత, ఈ రైళ్లు NMG కోచ్‌లుగా మార్చబడతాయి. ప్యాసింజర్ కోచ్‌ను ఎన్‌ఎంజీ కోచ్‌గా మార్చిన తర్వాత మరో 5 నుంచి 10 ఏళ్లపాటు వినియోగిస్తారు. చివరికి అది దేనికి పనికి రాదు అంటే అప్పుడు పక్కన పడేస్తారు.



Source link

Related posts

ఫుడ్ అలెర్జీని ఎదుర్కొనే ‘గేమ్ ఛేంజర్’.. కొత్త రోగనిరోధక కణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

Oknews

మిగిలిన ఆహారాన్ని పడేస్తున్నారా.. ఈ రెసిపీస్ మీ కోసమే..

Oknews

సున్నా రూపాయి నోటు కూడా ఉందని మీకు తెలుసా ?

Oknews

Leave a Comment