‘డబుల్’ బోల్డ్ క్యారెక్టర్ నాది


రామ్ పోతినేని, పూరి జగన్నాధ్‌ డెడ్లీ కాంబినేషన్‌లో తయారైన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

-పూరి, ఛార్మి ని కలసి ఆడిషన్స్ ఇచ్చాను. వారికి నచ్చింది. అయితే సమయంలో ఓ చిన్న యాక్సిడెంట్ గా కారణంగా కాస్త వెయిట్ పెరిగాను. కొంచెం వెయిట్ తగ్గమని చెప్పారు. రెండు నెలలు హార్డ్ వర్క్ చేసి వెయిట్ తగ్గాను. క్యారెక్టర్ కి ఫిట్ అయ్యాను.

ఇంత అద్భుతమైన కాంబినేషన్ వున్న సినిమాలో వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీలౌతున్నాను. ఇస్మార్ట్ శంకర్ కి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్ టైన్మెంట్ వుండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా వుంది. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది ?

-ఇందులో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ గా వుంటుంది. ఏదైనా సొంతగా నేర్చుకునే అమ్మాయి. తను చాలా స్మార్ట్, అదే సమయంలో తనలో ఇన్నోసెన్స్ కూడా వుంటుంది. ఇందులో నాకు ఫైట్ సీన్స్ కూడా వున్నాయి. ఒక యాక్టర్ గా ఎప్పటినుంచో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని కొరుకున్నాను. ఈ సినిమాతో అలాంటి క్యారెక్టర్ రావడం ఆనందంగా వుంది. ఈ క్యారెక్టర్ చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాను.

రామ్ తో డ్యాన్స్ బెస్ట్ ఎక్స్ పీరియన్స్. నా బెస్ట్ డ్యాన్స్ ఇచ్చాను. టీం అంతా చాలా సపోర్ట్ చేశారు.

ఓర్పుగా వుండటంతో పాటు చాలా విషయాలు పూరి నుంచి నేర్చుకున్నాను. ఆయన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. సెట్ లో చాలా కూల్ గా వుంటారు. ఆయనలో మంచి ఫిలాసఫర్ కూడా వున్నారు. జీవితం పట్ల ఆయనకి వున్న క్లారిటీ అమెజింగ్.

The post ‘డబుల్’ బోల్డ్ క్యారెక్టర్ నాది appeared first on Great Andhra.



Source link

Leave a Comment