Health Care

డయాబెటిస్ పేషెంట్లకు బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తోన్న ఐదు రకాల చిరుధాన్యాలు!


దిశ, ఫీచర్స్: డయాబెటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మందిని ప్రభావితం చేస్తోన్న అనారోగ్య సమస్యల్లో ఒకటి. డయాబెటిస్‌ను మరో పేరు చక్కెర వ్యాధి. ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు.

జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు జెనెటిక్ హిస్టరీ వంటివి దీనికి కారణం అవుతున్నాయి. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే నయమవడం కష్టం. కాగా డయాబెటిస్ పేషెంట్లు ముఖ్యంగా ఐదు రకాల చిరుధాన్యాలను కనుక తీసుకున్నట్లైతే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ లక్షణాలు అండ్ ఈ వ్యాధిని అదుపులో ఉంచే చిరుధాన్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటిస్ లక్షణాలు..

* రోగ నిరోధక శక్తి తగ్గడం. తరచు వ్యాధులకు గురికావడం

* కడుపులో నొప్పి

* చర్మం మంటగా ఉండటం, ఒంటిపై గాయాలు త్వరగా మానకపోవడం

* వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం

* సెక్స్ కోరికలు సన్నగిల్లడం

* చర్మం ముడత పడటం.

* రక్తహీనత సమస్య

* ఎప్పుడు పడుకోవాలనిపించడం

* పనిలో ఆసక్తి లేకపోవడం

* నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం వేయడం

* తరచూ మూత విసర్జన చేయడం

* ఎక్కువ ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గిపోవడం

* కంటి చూపు మందగించడం

* కీళ్ళనొప్పులు

* ఒంటి నొప్పులు

డయాబెటిస్ పేషెంట్లు తీసుకోవాల్సిన 5 రకాల చిరుధాన్యాలు:

పూర్వకాలంలో పెద్దలు జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు ఎక్కువగా తినేవారు. తెల్ల బియ్యం అందుబాటులోకి వచ్చాక చిరుధాన్యాలు తినే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుత రోజుల్లో మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతుండటంతో మళ్లీ ఆరోగ్యం, ఫిట్నెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. డాక్టర్లు చిరుధాన్యాలు తినాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సామలు (little millet)

చిరుధాన్యాలలో ఒకటైన సామలను ప్రతి రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సామలను ఇంగ్లీషులో ‘లిటిల్ మిల్లెట్స్’ అని పిలుస్తారు. వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఐరన్, బి విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. సామలలో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు, పాలీఫెనాల్స్, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంచడానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే జీర్ణ సమస్యలను, గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువు సమస్యలతో బాధపడుతున్న వారికి సామలను అన్నంగా వండుకుని తినవచ్చు.

రాగులు (finger millets)

ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే రాగులు తీసుకుంటే హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్న వారికి సహాయపడతాయి. ముఖ్యంగా రోస్ట్ చేసిన రాగులను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా.. కాలేయ వ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. రాగుల్లో పాలిఫెనాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. షుగర్ లెవల్స్ పెరగనివ్వకుండా.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

కొర్రలు (Fox Tail Millets)

కొర్రలను ఇంగ్లీషులో Fox Tail Millets అంటారు. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే కొర్రలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఫాక్స్ టైల్ మిల్లెట్స్ బాగా ఉపయోగపడతాయి. సలాడ్లు, సూపులలో భాగంగా కూడా చేసుకుని వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. కొర్రలను ప్రతి రోజూ తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు దరిచేరకుండా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు, మతిమరుపు లాంటివి తరిమికొడతాయి.

సజ్జలు (Pearl millet)

ముఖ్యంగా సజ్జలను చలికాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో అంతర్గత వేడిని కాపాడుకోవడంలో ఉపయోగపడుతాయి. కాల్షియం అధికంగా ఉండే సజ్జలను తీసుకుంటే బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండటమే కాకుండా.. కీళ్ల నొప్పులు, బోలు ఎముకల వ్యాధిని నిరోధిస్తాయి. సజ్జలు తినడం వల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సజ్జలను గ్రాండ్ చేసి.. రొట్టెలు చేసుకోవచ్చు. అలాగే జావలా చేసుకుని తాగవచ్చు. ఈ విధంగా చేస్తే.. మధుమేహ వ్యాధుగ్రస్తులకు బాగా మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

ఊదలు (Barnyard millet)

చిరుధాన్యాల్లో ఒకటైన ఊదలు ఉత్తరాఖండ్‌లో ఎక్కువగా పండిస్తారు. తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కూడా వీటిని పండిస్తున్నారు. ఊదలు ప్రతిరోజూ తీసుకున్నట్లైతే రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతాయి. పెద్ద వారిలో మూత్రాశయ నియంత్రించడం, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించడం, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం చేయడం, పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడకుండా ఉండటం, గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడం, వెయిట్ లాస్‌కు గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించడం.. ఇలా ఊదలు ఎన్నో రకాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఊదలు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగపడుతాయంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్ మధుమేహులకు షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయని చెబుతున్నారు. ఊదలతో గంజి కాచుకొని తాగితే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.



Source link

Related posts

పిల్లలకు పాలు తాగిన వెంటనే ఈ ఫుడ్స్ ఇస్తున్నారా..? అయితే ప్రమాదమే..

Oknews

అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ హనీమూన్ విల్లా.. గోల్డ్, డైమండ్స్‌తో కళ్లు చెదిరిపోయే డెకరేషన్(వీడియో)

Oknews

కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుట్టరు.. అయినా ఎందుకు తినాలి?

Oknews

Leave a Comment