Health Care

డయేరియాతో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేసి ఆ సమస్యకు చెక్ పెట్టండి


దిశ, ఫీచర్స్: విరోచనాలు అయ్యేటప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు అంటూ చాలా మంది భయపడుతుంటారు. ఆ సమయంలో నీరసం ఎక్కువవుతుంది. కొంతమందికి కడుపు నొప్పి , వాంతులు ఉంటాయి. మరి కొంతమంది మోషన్స్ బాధ తట్టుకోలేక మెడిసిన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ఏయే ఆహారపదార్థాలు తీసుకోవాలో కూడా అర్ధం కాకుండా ఉంటుంది. అయితే, కొన్ని పదార్థాలు మరిన్ని సమస్యలను కలిగిస్తాయి. ఆ ఆహారాలు ఏంటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

మోషన్స్ వల్ల శరీరం నుండి మొత్తం నీటిని తొలగిస్తుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఈ సమయంలో తేలికపాటి ఆహారం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఓట్స్‌:

ఓట్స్‌ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆహారం ఈజీగా అరుగుతంది. మోషన్స్‌ కంట్రోల్‌ చేయడంలో ఓట్స్‌ ఎంతోగానో ఉపయోగపడుతాయి.

ఉప్పు నీరు:

మోషన్స్‌ కారణంగా శరీరం ఎంతో నీరసంగా అవుతుంది. తిరిగి మీరు శక్తి పొందాలి అంటే ఈ ఉప్పు నీరు సహాయపడుతుంది. ఉప్పు నీరు ఇష్టంలేని వారు షుగర్‌ కలిపిన నీరు తీసుకున్న సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

మునగాకు జ్యూస్‌:

మునగాకు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల మలబద్ధం, మోషన్స్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. మోషన్స్‌ ఉన్నప్పుడు ఈ ఆకుతో తయారు చేసిన జ్యూస్‌ తీసుకోవడం మంచిది. ఈ విధంగా చెప్పిన పదార్థాలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.



Source link

Related posts

మటన్‌లో ఏ ఏ పార్ట్స్ దేనికి ఉపయోగపడుతాయి.. సూపర్ మెడిసిన్‌లా పనిచేస్తాయంటున్న నిపుణులు

Oknews

ఆహారాన్ని చేతితో తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలుసా?

Oknews

రోజూ అర టీస్పూన్ పసుపు తీసుకుంటే ఆ సమస్యలు మాయం

Oknews

Leave a Comment