డిజిటల్ అమ్మకాలు కాకుండా..!


డిజిటల్ అమ్మకాలు కాకుండా థియేటర్లోకి రావడం అంటే కాస్త భయంగానే వుంది నిర్మాతలకు. థియేటర్ బిజినెస్ ఎలాగూ చిన్న, మీడియం సినిమాలకు అంత ఆసక్తికరంగా లేదు. అందువల్ల ముందు డిజిటల్ క్లోజ్ అయితేేనే ఆనందం. పైగా డిజిటల్ స్లాట్ ను బట్టి అమ్మకం అనేది వుంది. అందువల్ల సినిమా విడుదల తేదీ వేయాలంటే డిజిటల్ అమ్మకాలు తప్పవు.

పీపుల్స్ మీడియా సంస్థ రవితేజతో నిర్మిస్తున్న బచ్చన్ సినిమా పరిస్థితి ఇలాగే వుంది. ఈ సినిమా అమ్మకాలు ఇంకా జరగలేదు. ఇటు థియేటర్ అటు నాన్ థియేటర్. థియేటర్ రైట్స్ తెలుగు రాష్ట్రాలకు 35 కోట్ల వరకు చెబుతున్నారు. కానీ బయ్యర్లు ప్రస్తుతానికి 27 దగ్గర ఆగినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా వుంటే డిజిటల్ అమ్మకాలు కీలకం. డిజిటల్ అమ్మకం జరిగి, ఓటిటి సంస్థ ఎప్పుడు స్లాట్ ఇస్తే ఆ స్లాట్ కు నాలుగు నెలలు ముందుగా విడుదల డేట్ వేసుకోవాల్సి వుంటుంది.

ప్రస్తుతానికి అయితే ఈ ఏడాదికి డిజిటల్ స్లాట్ లు ఖాళీగా లేవు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఓటిటి సంస్థలు కనుక ఈ ఏడాదికి మిగిలిన అయిదు నెలల్లో స్లాట్ అడ్జస్ట్ చేస్తే అదృష్టమే. గతంలో ఇదే సంస్థ నిర్మించిన రవితేజ సినిమా ఈగిల్ ను ఏ రైట్స్ అమ్మకుండా స్వంతంగా థియేటర్లో విడుదల చేసుకుంది. దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి అలాంటి పొరపాటుచేయకుండా, అన్నీ అమ్మకాలు జరిగిన తరువాతే థియేటర్లోకి వదలాలని డిసైడ్ అయ్యారు.

The post డిజిటల్ అమ్మకాలు కాకుండా..! appeared first on Great Andhra.



Source link

Leave a Comment