Health Care

డిజిటల్ ఇండియా అంటే ఇదే!.. ఓ డ్యాన్సర్ ఆలోచనలకు నెటిజన్లు ఫిదా..


దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. ఆఖరికి టీ నుంచి పెద్ద మొత్తం వరకు వీటినే ఉపయోగిస్తున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దేశంలో డిజిటల్ విప్లవం మొదలైంది. ముఖ్యంగా కరోనా టైమ్‌లో నగదు బదిలి కోసం ఈ విధానం ఎంతగానో ఉపయోగపడింది. తొలుత ఈ విధానానికి అలవాటు పడటానికి దేశ ప్రజలు ఇబ్బంది పడ్డా కాలక్రమేణా బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు రూపాయి మొదలుకొని వేల రూపాయల వరకు అన్ని డిజిటల్ విధానంలోనే జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఉండే కూరగాయల షాపుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్ని ఆన్‌లైన్ పేమెంట్సే. ఇక జూపార్కులో, టీటీడీ దేవస్థానం, ఇతర ప్రభుత్వ సంస్థలు అయితే నగదును తీసుకోవడమే మానేశాయి. దీంతో డిజిటల్ విధానం అనివార్యమైంది. కాగా ప్రస్తుతం డిజిటల్ విధానం ఎంతగా అభివృద్ధి చెందిందో తెలిసేలా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..

ఇదిలా ఉండగా ఓ డ్యాన్సర్ స్టేజిపై డాన్స్ చేస్తూ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని క్యూఆర్ కోడ్‌ను చూపిస్తుంది. ఆమె నృత్యానికి మెచ్చి డబ్బులు ఇవ్వాలనుకునే వారు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఇవ్వాలనుకున్న మొత్తాన్ని పంపిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు మాత్రం తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ ఇండియా అంటే ఇదే అని.. మోడీ కోరుకున్న డిజిటల్ ఇండియా ఇదేనని మరికొందరు అంటున్నారు. ఆ డ్యాన్సర్‌కు వచ్చిన ఆలోచనకు మరికొందరు ఫిదా అయితే, ఇంకొందరు డిజిటల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను నియమించాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి.



Source link

Related posts

బ్రా వేసుకోవడం వల్ల ప్రమాదం.. జాగ్రత్తలు తీసుకోకుంటే డేంజర్‌లో పడ్డట్టే!

Oknews

ప్రకృతిపై సూర్య గ్రహణం ఎఫెక్ట్..ఆ రోజు పక్షులు, జంతువులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసా?

Oknews

Protein deficiency : మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఏవో తెలుసా?

Oknews

Leave a Comment