EntertainmentLatest News

డిపి మార్చిన ఓజి డైరెక్టర్.. పిక్ లో ఉన్న పర్సన్ ని చూసి పవన్  ఫ్యాన్స్ రిప్లై 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో సేమ్ అంతే క్రేజ్ పవన్ తో సినిమా చేసే డైరెక్టర్ కి కూడా ఉంటుంది.ఇందుకు ఉదాహరణగా చాలా మంది దర్శకులు ఉన్నారు. పవన్ తో సినిమా జరుగుతున్నంత సేపు  పవన్  ఫ్యాన్స్ దృష్టిలో డైరెక్టర్ కూడా ఇంకో మినీ పవర్ స్టార్ గా ఉంటాడు.అలాంటిది ఒక డైరెక్టర్ తన డిపి మార్చిన విషయం ఇప్పుడు  వైరల్ అవుతుంది. 

 పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టిజియస్ట్ మూవీ ఓజి. ఈ మూవీలో పవన్ అండర్ వరల్డ్ మాఫియా కింగ్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి  సుజిత్  దర్శకుడు. లేటెస్ట్ గా సుజిత్ తన ఇనిస్టాగ్రమ్ డీపీ ని చేంజ్ చేసాడు.అయితే అందులో ఏముందని అనుకుంటున్నారా!  చేంజ్ చేసిన పిక్ లో ఒక వ్యక్తి సుజిత్ భుజాల మీద చెయ్యి వేసి ఆయనతో ఏదో చెప్తున్నాడు. అలా చెప్తుంది ఎవరో కాదు పవన్ కళ్యాణ్. తన బెస్ట్ ఫ్రెండ్  మీద చెయ్యి వేసినట్టుగా ఉన్న పవన్ పిక్ ఇప్పుడు  సోషల్ మీడియా ని ఒక లెవల్లో షేక్ చేస్తుంది. పవన్ ఫ్యాన్స్ అయితే తన డైరెక్టర్స్ తో పవన్ చాలా ఫ్రెండ్లీ ఉంటాడు అనడానికి నిదర్శనమని  అంటున్నారు. అలాగే డిపి కి రిప్లై లు కూడా ఇస్తున్నారు.

సెప్టెంబర్ 27  న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఓజి లో పవన్ సరసన  ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా చేస్తుండగా డివి వి ఎంటర్ టైన్మెంట్ పై దానయ్య  నిర్మిస్తున్నాడు.ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత ఇదిగా ఎదురుచూస్తున్నారో ప్రేక్షకులు కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు.


 



Source link

Related posts

100నూతన బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!

Oknews

హీరో అంటే 200 కోట్లు కొట్టాలా ఏంటి?..

Oknews

సికింద్రాబాద్ మహంకాళి గుడిలో ప్రధాని మోదీ పూజలు..!

Oknews

Leave a Comment