Health Care

డిప్రెషన్‌‌ with బాడీ టెంపరేచర్ .. ఎందుకిలా జరుగుతుంది?


దిశ, ఫీచర్స్ : సాధారణ వ్యక్తులతో పోలిస్తే డిప్రెషన్ బాధితుల్లో శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన పరిశోధకులు అధ్యయనంలో వెల్లడైంది. తగిన చికిత్స చేయడంలో ఈ సరికొత్త అవగాహన సహాయపడుతుందని ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మెదడు, శరీరంపై ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయంలో మాత్రం మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

అధ్యయనం, నిర్ధారణ 

స్టడీలో భాగంగా పరిశోధకులు మొత్తం 20,880 మంది డిప్రెషన్, అలాగే డిప్రెషన్ రహిత వ్యక్తులకు సంబంధించిన డేటాను సేకరించి, ఏడు నెలల పాటు విశ్లేషించారు. సెల్ఫ్ రిపోర్టెడ్ విషయాలను, బాధితులు సెన్సార్లు ధరించి ఉన్నప్పుడు పరిశీలించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. కాగా డిప్రెషన్‌తో బాధపడుతున్నవారి బాడీ టెంపరేచర్ మిగతా వారికంటే అధికంగా ఉండటం, అనుకోకుండా హెచ్చు తగ్గులు సంభవించడాన్ని ఈ సందర్భంగా నిర్ధారించారు. అయితే ఇక్కడ ఇన్విస్టిగేషన్ చేయదగిన కనెక్షన్ ఉందని కూడా పేర్కొన్నారు. ఒకేవేళ బాడీ టెంపరేచర్ కూల్‌గా లేదా తక్కువగా ఉంచుకోవడం డిప్రెషన్ లక్షణాలను తగ్గుతున్నట్లు పూర్తిస్థాయిలో నిరూపితమైతే తమ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

కొన్ని సందర్భాల్లో భిన్నంగా ..

డిప్రెషన్ లక్షణాలకు, బాడీ టెంపరేచర్‌కు మధ్య లింక్‌కి అనేక కారణాల వల్ల ఉండవచ్చునని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే శరీరంలో అదనపు వేడిని ఉత్పత్తి చేసే మెటబాలిక్ ప్రాసెస్‌లతో బాడీ టెంపరేచర్ ముడిపడి ఉంటుంది. దీంతోపాటు సరిగ్గా పనిచేయని జీవసంబంధమైన విధులను కూడా చల్లబరుస్తుంది. అంటే శరీర ఉష్ణోగ్రత, డిప్రెషన్ లక్షణాలు రెండింటినీ వేర్వేరుగా ప్రభావితం చేసే మానసిక ఒత్తిడి లేదా వాపు వంటి సాధారణ కారణాలు కూడా ఉంటాయని రీసెర్చర్స్ పేర్కొంటున్నారు. కొన్ని పరిస్థితులలో హాట్ టబ్స్, ఆవిరి స్నానాలు డిప్రెషన్ లక్షణాలను తగ్గించగలవని మునుపటి పరిశోధలు చెప్తున్నాయి. అలాగే చెమట పట్టడం, బాడీ టెంపరేచర్ పెరగడం వంటి సందర్భాల్లో సెల్ఫ్-కూలింగ్ మానసిక ప్రశాంతతను కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం.



Source link

Related posts

ముద్దులు పెట్టుకుంటే అలాంటి వ్యాధులు వస్తాయా ?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Oknews

నేల రహిత పంటలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

Oknews

కుంభంలో అస్తమించనున్న శని.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు..?.. మీ రాశి ఉందా?

Oknews

Leave a Comment