Top Stories

డిశ్చార్జ్ అయిన సైఫ్.. దేవరపై డౌట్స్?


దేవర సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్, హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత అతడు ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. భార్య కరీనా కపూర్ వెంట రాగా.. చేతికి కట్టుతో ఆయన కోకిలాబెన్ హాస్పిటల్ నుంచి తన నివాసానికి చేరుకున్నాడు.

ఇంటికెళ్లిన తర్వాత జూమ్ లో మాట్లాడాడు సైఫ్. తన గాయం గురించి వెల్లడించాడు. చాలా ఏళ్ల కిందటే సైఫ్ కు గాయమైందట. ఈమధ్య దేవర సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు అది మళ్లీ తిరగబెట్టిందట.

ఎందుకైనా మంచిదని స్కానింగ్ చేయించుకుంటే గాయం తీవ్రత బయటపడిందని, అయినప్పటికీ దేవర షూటింగ్ పూర్తిచేసి, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని, ఆ తర్వాత హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు సైఫ్ వెల్లడించాడు. వైద్యులు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.

దేవర రిలీజ్ పై డౌట్స్.. సైప్ కు సర్జరీ అవ్వడంతో ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన దేవర సినిమా వాయిదా పడుతుందనే ఉహాగానాలు ఎక్కువయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, దేవర సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దానికి కారణం సైఫ్ గాయం మాత్రం కాదని తెలుస్తోంది.

సినిమాకు సంబంధించి షూట్ చేయాల్సిన పోర్షన్ ఇంకా మిగిలి ఉందట. రాబోయే నెల రోజుల్లో అది పూర్తిచేయడం సాధ్యం కాదనే టాక్ వినిపిస్తోంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జనరల్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న దేవరను ఆ టైమ్ లో విడుదల చేయడం కరెక్ట్ కాదని యూనిట్ భావిస్తోందట.



Source link

Related posts

రామోజీ ఆద‌ర్శాలు పాటిస్తున్నారా?.. బ‌హిరంగ లేఖ‌!

Oknews

ఆత్మహత్యలకు కేటీఆర్ హింట్ ఇస్తున్నారా?

Oknews

బుల్లితెరపై సంక్రాంతి విజేత ఎవరు?

Oknews

Leave a Comment