Top Stories

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'మాన్షన్ 24'


టెలివిజన్, సినిమా రంగాల్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న స్టార్ ప్రెజెంటర్, డైరెక్టర్ ఓంకార్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ ని అందించారు. దాని టైటిల్ "మాన్షన్ 24".

ఓ పాడుబడిన మాన్షన్ లో.. ఏ క్షణం ఎలాంటి మనుషులు ఎదురవురుతారో, ఏ నిమిషం ఏం జరుగుతుందో, ఎలాంటి గగుర్పొడిచే సన్నివేశాలు తారసపడతాయో తెలియని సస్పెన్స్ తో నడిచే ఈ కథ రకరకాల మనుషుల్ని, వాళ్ళలో  ఊహించలేని కోణాల్ని మనకు పరిచయం చేస్తుంది. హారర్, థ్రిల్లర్ అంశాల మేలు కలయికగా రూపొందిన ఈ సిరీస్ సమపాళ్లలో అన్ని హ్యూమన్ ఎమోషన్స్ తో అలరిస్తోంది.

అంతుపట్టని మిస్టరీ ని, దాని వెనకాల వున్న ఒక భయంకరమైన నిజాన్ని ఛేదించడానికి ఒక అమ్మాయి చేసే ప్రయత్నాల్లో ఆమెకి ఎదురైన ఎన్నో భయంకరమైన అనుభవాలతో  "మాన్షన్ 24" ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. ఒక సరికొత్త నేపథ్యం, దాన్ని మ్యాచ్ చేసే కథాంశం "మాన్షన్ 24" సిరీస్ కి ఓ కొత్త ఫ్లేవర్ తో పాటు ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇచ్చింది.

సీనియర్ నటులు సత్యరాజ్, రావు రమేష్, వరలక్ష్మి శరత్ కుమార్, తులసి , రాజీవ్ కనకాల, అవికా గోర్, జయప్రకాశ్, బాహుబలి ప్రభాకర్, విద్యుల్లేఖ, అభినయ, అయ్యప్ప పి  శర్మ, శ్రీమాన్ , బిందు మాధవి, నందు తదితరులు విలక్షణమైన పాత్రల్లో.. ఇంతకుముందు ఎన్నడూ చూడని సన్నివేశాల్లో ఆశ్చర్యపరుస్తున్నారు. బేసిక్ గా ఒక మాన్షన్ చుట్టూ తిరిగే ఈ కథ .. మనుషుల భావోద్వేగాల్ని అద్భుతంగా పండించింది.

"మాన్షన్ 24" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/46x37pi



Source link

Related posts

బాబు హెల్త్ రిపోర్ట్‌పై వివాదం!

Oknews

ఎట్ట‌కేల‌కు స‌మ్మె విర‌మింప‌జేసిన ఏపీ స‌ర్కార్‌

Oknews

కాజల్ జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చేసిందా?

Oknews

Leave a Comment