సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు(High Court) సీజే ధర్మాసనం తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. నోటిఫికేషన్ ప్రక్రియపై ముందుకెళ్లొద్దని, హాల్ టికెట్లు(Hall Tickets) జారీ చేయవద్దని ఓ దశలో సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఉత్తర్వులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయం తెలియజేస్తామని ఏజీ కోర్టును కోరారు. 2018లో సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎలా నోటిఫికేషన్ జారీ చేశారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. నోటిఫికేషన్ పై ముందస్తు చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ఎస్జీటీ అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగా బీఈడీ(B.Ed) అభ్యర్థులను అనుమతించాల్సి పరిస్థితి వచ్చిందని గత విచారణలో ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. అయితే అర్హులైన బీఈడీ అభ్యర్థులు రెండేళ్ల బ్రిడ్జి కోర్స్ చేసిన తర్వాతే టీచింగ్ కు అనుమతిస్తామని కోర్టుకు తెలిపారు. బ్రిడ్జి కోర్సుకు చట్టబద్ధత ఎలా ఉంటుందని ప్రశ్నించిన సీజే….సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఎలా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ఏజీని ప్రశ్నించారు.