దిశ, ఫీచర్స్: ప్రస్తుతం వర్షాకాలం స్టార్ అయ్యింది. ఈ కాలం వర్షాలతో పాటు రోగాలను కూడా తీసుకొస్తుంది. దోమల బెడద వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి రోగాలతో పాటు వైరల్ ఫీవర్ కూడా ప్రబలుతుంటాయి. వాటి వల్ల ప్లేట్‌లెట్ల్స్ కౌంట్ అమాంతం పడిపోతుంటుంది. ఒక్కోసారి ప్రాణాంతక మయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో హెల్తీ ఫుడ్స్‌తో పాటు అప్పుడే ఫ్రెష్‌గా చేసిన వేడి వేడీ ఆహారం మాత్రమే తీసుకోవాలి.
ఇక ఎవ్రీ ఇయర్ వర్షాకాలంలో సాధారణంగా కనిపించే సమస్య డెంగ్యూ. ఇదొక సీరియస్ వ్యాధి. ఈ వ్యాధి సోకిన రోగికి రక్తంలోని ప్లేట్‌లెట్ కౌంట్ అమాంతం తగ్గిపోతుంటుంది. బ్లడ్ క్లాటింగ్‌లో ప్లేట్‌లెట్ దోహదపడతాయి. ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గితే బ్లీడింగ్, ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అయితే ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ సంఖ్యను పెంచవచ్చు. ప్లేట్‌లెట్ కౌంట్ పెంచేందుకు వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నా నేచురల్‌గా పెంచుకోవడం బెస్ట్ వే. అయితే డెంగ్యూ సోకినప్పుడు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినప్పుడు వాటిని పెంచుకునేందుకు ఏయే పండ్లు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జామ:
ధర చాలా తక్కువ కావడంతో అందరికీ అందుబాటులో ఉండే పండు ఇది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది. ఇందులో ఉండే ఐరన్ రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణంలో ఉపయోగపడుతుంది. డెంగ్యూ సోకినప్పుడు రోజుకు 1-2 జాంకాయలు తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేస్తే ప్లేట్‌లెట్ కౌంట్ భారీగా పెరుగుతుంది.
అరటి పండు:
అరటిలో పొటాషియం పెద్ద ఎత్తున లభిస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసేందుకు దోహదం చేస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు సాధారణంగా వాంతులు, విరేచనాల సమస్య కారణంగా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి. దాంతో ప్లేట్‌లెట్స్ తగ్గి మనిషి పూర్తిగా బలహీనపడిపోతాడు. ఈ క్రమంలో రోజూ 1-2 అరటి పండ్లు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
దానిమ్మ:
దానిమ్మ అనగానే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి గుర్తొస్తాయి. ఈ రెండూ ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. ఇవి శరీరం ఇమ్యూనిటీని గణనీయంగా పెంచడం, ప్లేట్‌లెట్ సంఖ్య పెంచడం చేస్తాయి. రోజూ ఒక దానిమ్మ పండు లేదా ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం మంచిది.
బొప్పాయి:
ప్లేట్‌లెట్ కౌంట్ పెంచేందుకు అనాదిగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ మార్గం. బొప్పాయి పండుతో పాటు బొప్పాయి లేత ఆకుల రసం ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పపీతైన్ అనే ఎంజైమ్ రక్త కణాల నిర్మాణానికి దోహదం చేస్తుంది. డెంగ్యూ రోగులు రోజుకు కనీసం 100-200 గ్రాముల బొప్పాయి ముక్కలు తినాలి. లేదా రోజూ పరగడుపున బొప్పాయి లేత ఆకుల రసం 1-2 చెంచాలు తాగాలి
పుచ్చకాయ:
పుచ్చకాయలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు సాధారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతుంది. అయితే పుచ్చకాయ తినడం వల్ల అటు డీ హైడ్రేషన్ సమస్య తొలగిపోవడమే కాకుండా ప్లేట్‌లెట్ సంఖ్య కూడా పెరుగుతుంది. అంతేకాకుండా డెంగ్యూ రోగులు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు అత్యధికంగా తాగాలి.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.