Health Care

డెంగ్యూ భారీన పడకుండా ఉండాలా.. ఈ టిప్స్ పాటించాల్సిందే!


దిశ, ఫీచర్స్ : వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్‌లో అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విష జ్వరాలు ప్రజలపై పంజా విసురుతాయి. అందువలన ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇక వర్షాకాలంలో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలన డెంగ్యూ జ్వరం వ్యాపిస్తూ ఉంటుంది. అయితే ఈ డెంగ్యూ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కుండలు లాంటి వాటిల్లో వర్షం నీరు నిల్వ ఉంటే ఆ నీటిని పారబొయ్యాలి. లేకపోతే దోమలు పెరిగిపోయి, డెంగ్యూ వ్యాపించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

2. ఉదయం కాల్చి చల్లార్చిన నీటిని తీసుకోవాలి. సమతుల్య ఆహారం మాత్రమే తీసుకోవాలి. బయట ఫుడ్ అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

3. మామూలు జ్వరం, తలనొప్పి ఉన్నా లైట్ తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకోవాలి. లేకపోతే సమస్య ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

4. సాయంత్రం వేళలో డోర్లు, కిటికీలు మూసి ఉంచాలి. దీని వలన దోమలు ఇంట్లోకి చొరబడవు.

5. చిన్న పిల్లలు ఉన్న వారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దోమలు కుట్టకుండా వారిని రక్షించడానికి మస్కిటో క్రీమ్స్ రాయడం లేదా, దోమల తెర వాడటం, శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే డ్రెసెస్ వేయడం వంటివి చేయాలి. నోట్ : పై వార్తను దిశ ధృవీకరించడం లేదు. ఇంటర్ నెట్‌లో లభించిన సమాచారం ఆధారం, వివిధ నిపుణులు, వైద్యులు పేర్కొన్న సూచనల మేరకు మాత్రమే ఇవ్వబడింది.



Source link

Related posts

పదాల పదనిసలు.. మీ మైండ్‌ సెట్‌ను కూడా మార్చగలవు !

Oknews

కొబ్బరికాయ కుళ్లిపొవడం అశుభమా? | Is rotting coconut bad?

Oknews

నార్మల్ డెలివరీ కావాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ పాటించండి..

Oknews

Leave a Comment