Telangana

డెక్కన్ కిచెన్ కేసులో దగ్గుబాటి కుటుంబానికి షాక్, క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు-hyderabad news in telugu nampally court orders police file criminal case in daggubati family ,తెలంగాణ న్యూస్



Case On Daggubati Family : టాలీవుడ్ అగ్రహీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలతో పాటు సురేష్, అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ లోని ‘డెక్కన్‌ కిచెన్‌’ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి కుటుంబం డెక్కన్ కిచెన్ కూల్చివేసిందని ఆ హోటల్ యజమాని నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. హోటల్ కూల్చివేతతో తనకు రూ.20 కోట్లు నష్టం వాటిల్లిందని నందకుమార్ కోర్టుకు తెలిపారు. హోటల్ లీజు విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నా అక్రమంగా కూల్చివేశారని, విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని నందకుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లతో తన హోటల్ ను ధ్వంసం చేశారని కోర్టుకు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు… దగ్గుబాటు కుటుంబ సభ్యులపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.



Source link

Related posts

Weather in Telangana Andhra pradesh Hyderabad on 12 April 2024 Summer heat waves updates latest news here

Oknews

Hyderabad Wine shops would be closed on April 17th due to Sri Ramnavami

Oknews

హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి గ్రీన్ సిగ్నల్, జాతీయ రహదారిగా ప్రకటనకు ప్రతిపాదనలు-hyderabad news in telugu cm revanth reddy meets central minister nitin gadkari requests approval for national highways ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment