Health Care

డెలివరీ బాయ్ హోమ్ టూర్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..


దిశ, వెబ్ డెస్క్: ఏదైనా ఒక విషయం అది మంచి అయినా చెడు అయినా సాటి మనిషితో పంచు కోవడం మానవ సహజం. సమాచారాన్ని మాములుగా అయితే ఒకరితో చెప్తే వారి ద్వారా మరొకరికి తెలుస్తుంది. కానీ ఏక కాలంలో యావత్ ప్రపంచానికి తెలియజేసే వారధి సామాజిక మాధ్యమం. ఈ మధ్యకాలంలో బాధ అయిన సంతోషం అయినా ఫోటో రూపంలోనో వీడియో రూపంలోనో సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రముఖులంతా హోమ్‌ టూర్‌లు చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి అనేక మంది సెలబ్రెటీలు చేశారు. వాళ్లని అనుసరిస్తూ తాజాగా ఓ డెలివరీ బాయ్ చేసిన హోమ్ టూర్ అందరినీ ఆకర్షిస్తోంది.

ముంబైలో ప్రంజయ్ బోర్గోయరీ అనే యువకుడు జొమాటోలో డెలివరీ బాయ్ పనిచేస్తున్నాడు. ముంబై మహానగరంలో, ఇరుకు వీధుల్లో, తన స్నేహితుడితో కలిసి చిన్న గదిలో రూ.500 అద్దె చెల్లిస్తూ నివసిస్తున్నాడు. తన వృత్తిని ఇక్కడి జీవిత పరిస్థితులను, ఆ గదికి సంబంధించిన వీడియోను హోమ్ టూర్‌గా చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకి 4.5 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా పలువురు స్పందించారు కూడా. ఒక వ్యక్తి అతనికి మూడు నెలల అద్దె డబ్బులు కూడా పంపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తన కష్టానికి ఫలితం దక్కలని, ఒక స్థాయికి రావలని ఆకాంక్షించారు.





Source link

Related posts

శివలింగాన్ని ఎలా పూజించాలి.. శివపురాణంలోని నియమాలు ఏమిటో తెలుసా ?

Oknews

డర్టీ హార్మోన్స్ అంటే ఏమిటి?.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఏం చేయాలి?

Oknews

సమ్మర్‌లో చెమటతో విసిగిపోతున్నారా? కానీ బోలెడన్ని లాభాలున్నాయండోయ్..

Oknews

Leave a Comment