ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) పేరు మారుమోగిపోతోంది. ప్రభాస్ (Prabhas) హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) చిత్రం తాజాగా విడుదలై, విజువల్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉందనే టాక్ తెచ్చుకుంది. నాగ్ అశ్విన్ విజన్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఇండియన్ సినిమాకి మరో రాజమౌళి దొరికాడని అంటున్నారు. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డైరెక్టర్ కాకముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నాగ్ అశ్విన్ నటించాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 2008లో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘నేను మీకు తెలుసా’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు నాగ్ అశ్విన్. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర ‘లీడర్’ (2010), ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ (2012) సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇలా తాను అసిస్టెంట్ గా పని చేసిన మూడు సినిమాల్లోనూ నాగ్ అశ్విన్.. చిన్న చిన్న పాత్రలు పోషించడం.
2015 లో నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. మొదటి సినిమాతోనే మెప్పించాడు. రెండో సినిమా ‘మహానటి’తో ఘన విజయాన్ని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు మూడో సినిమా ‘కల్కి’తో సంచలనాలు సృష్టిస్తున్నాడు.